సా...గుతున్న బయోపిక్ ట్రెండ్: రాహుల్ గాంధీ సినిమా "మై నేమ్ ఈజ్ రాగా" టీజర్

20:49 - February 10, 2019

 

 

 

 

 

 

 

 

ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకూ బయోపిక్ హవా తగ్గేటట్టు లేదు వరుసగా అటు బాలీవుడ్ లోనూ ప్రాంతీయ భాషల్లోనూ ఇప్పుడు పొలిటికల్ బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. భహిరంగ సభల్లోనూ, వంద ఉపన్యాసాల్లోనూ చెప్పలేనిది ఒక్క బయో పిక్ లో చెప్పొచ్చు, అందులోనూ విపరీతమైన డ్రామా, సెంటిమెంట్ కలిపి మరీ ప్రేక్షకులని ఎమోషనల్ గా కనెక్ట్ చేయవచ్చు. ఎప్పుడైతెఅ ఈ విషయం అర్థమయ్యిందో పొలిటికల్ పార్టీలన్నీ బయోపిక్ ల వెంట పడ్డాయి. ఒకప్పుడు క్రీడాకారులూ, రచయితల జీవితాల మీదనే వచ్చిన బయో పిక్స్ ఇప్పుడు వరుసగా రాజకీయ నాయకుల మీదనే రావటానికి కారణం ఇదే. రెండున్నర గంటల పాటు "ప్రజా సేవకోసం తమ జీవితాలని ఎలా త్యాగం చేసారో" గొప్పగా చెప్పేసుకోవచ్చు. 

 పొలిటికల్ మైలేజీకి ఇవి ఖచ్చితంగా పనికి వస్తాయి. అందుకే ఇప్పుడు వరుసబెట్టి వస్తున్న బయో పిక్ వరుసలో కొత్తగా కాంగ్రేస్ నేత రాహుల్ గాంధీ కూడా చేరిపోయాడు "మై నేమ్ ఈజ్ రాగా" అనే టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో రాహుల్ గాంధీ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ జీవితాన్ని చూపించ‌నున్నారట. 
 గతం లో సెయింట్ డ్రాకులా, కామ‌సూత్ర వంటి చిత్రాలు తెర‌కెక్కించిన పాల్ రూపేష్ ద‌ర్శ‌క‌త్వంలో  తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో గాంధీ ఫ్యామిలీకి చెందిన వారంద‌రిని చూపిస్తూ రాహుల్ రాజ‌కీయ ఆరంగేట్రం జ‌రిగిన విధానాన్నిక్లుప్తంగా చూపించారు.

ఇది రాహుల్ బ‌యోపిక్ కాద‌ని, అత‌నిపై జ‌రుగుతున్న దాడి నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడో చూపించే ఇతి వృత్త‌మ‌ని ద‌ర్శ‌కుడు రూపేశ్ అంటున్నాడు. దీనికోసం రాహుల్ చదువుకున్న యూఎస్‌లోని కొల్లిన్ కాలేజ్‌, ఇట‌లీని ఆయ‌న గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో కొన్ని కీల‌క స‌న్నివేశాలు షూట్ చేయ‌నున్నార‌ట‌. త‌క్కువ షెడ్యూల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్న మేము క్రియాశీల రాజకీయాల్లో ప్రియాంక ప్రవేశాన్ని చివ‌రి సీన్‌గా షూట్ చేస్తామ‌ని రూపేష్ అన్నారు. 2019 ఎల‌క్షన్స్‌కి ముందు ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. మ‌రి ఈ చిత్రం ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో.