నా భర్త స్నానం చెయ్యటం లేదు, విడాకులిప్పించండి: విడాకులకో వింత కారణం

13:08 - April 13, 2019

*ఆ ఇద్దరిదీ ప్రేమ వివాహమే అయినా విడాకులు కోరుతున్నారు 

*నా భర్త స్నానం చెయ్యటం లేదు, విడాకులిప్పించండిఅంటూ చెప్పిన భార్య 

*భోపాల్ లో విడాకుల కోసం వింతకారణం, అసలు కారణం స్నానమా? కులమా?? 

 

ఆ ఇద్దరిదీ ప్రేమ వివాహం, ఏడాది కిందటే పెళ్ళి జరిగింది అయితే సంవత్సరం తిరక్కుండానే తన భర్తనుంచి తనకు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిందా అమ్మాయి. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో ఇద్దరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

ఒక్క సంవత్సరంలో ఎమంత నరకం చూపించాడో. డబ్బుకోసమో, కట్నం కోసమో ఆ పిల్లని వేదించే ఉంటాడు అనుకుంటున్నారా?  అబ్బే అదేం లేదు. స్నానం చెయ్యటం లేదట, రోజూ షేవింగ్ చేసుకోవటం లేదట. నాలుగు రోజులు పాటు స్నానం చేయకుండా ఉంతున్నాడనీ, దగ్గరికి వస్తే అతని కంపు తట్టుకొలేక పోతే స్ప్రే కొట్టుకుని అలా గడిపేస్తున్నాడు కాబట్టి ఆ మురికి భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరిందట ఆ అమ్మాయి.  
   అయితే ఈ కారణం మనకు వింతగా అనిపించవచ్చుగానీ మరీ నీట్ గా ఉండాలనుకునే వాళ్ళకి కాస్త ఇబ్బందే అనుకోవాలి. అయితే దీని వెనుక మరో కారణం  కూడా ఉందవచ్చని వినిపిస్తోంది. ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ అవస్థి మాటలని బట్టి చూస్తే... 

ఆమె బ్రాహ్మణ కమ్యూనిటికీ చెందిన మహిళ, సింధి కమ్యూనిటీకి చెందిన అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది. సంవత్సరం తర్వాత చిన్న కారణంతోనే విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇంట్లో వాళ్లు ఎంత వద్దని చెప్పినా ఆమె వినలేదన్నారు. మొత్తానికి ఇక్కడ ఏదో మెలిక ఉన్నట్టే ఉంది. సరే లెండి పాపం ఆ అమ్మాయికి విడి పోవాలని ఉన్నప్పుడూ, తగొచ్చి కొట్టే, అదనపు కట్నం కోసం వేదించే అక్లవాటు ఆ అబ్బాయికి లేనపుడు తను మాత్రం ఏం చేస్తుందీ. కోర్టుకి ఏదో ఒక కారణం చూపించాలి కదా మరి.