భారత్‌-పాక్‌ మధ్య మొదలైన యుద్ధ వాతావరణం...

13:48 - February 27, 2019

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.  భారత్ తో యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధమైంది. రావల్పిండి - ఇస్లామాబాద్ లో తాజా సైరన్లు మోగించి యుద్ధ సన్నాహాలు ప్రారంభించింది.  రాజోరి - నౌషెరీ పలుచోట్ల పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. పలు చోట్ల బాంబులు వేశాయి. భారత గగనతలంలోకి 3 కి.మీల దూరం చొచ్చుకువచ్చిన పాకిస్తాన్ యుద్ధవిమానాలను తరిమికొట్టినట్టు భారత ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. మొదట మూడు పాకిస్తాన్ యుద్ధ విమానాలు నౌషేరా సెక్టార్ గగనతలంలోకి ప్రవేశించిన భారత్ గుర్తించింది. నౌషేరాలో  ప్యాట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో భారత యుద్ధవిమానాలు పాక్ విమానాలను గుర్తించి రియాక్ట్ అయ్యాయి.  గట్టిగా ప్రతిఘటించడంతో పాక్ విమానాలు వెనక్కి వెళ్లిపోయని భారత అధికారి వెల్లడించారు. అంతేకాదు...నౌషెరాలోని పాకిస్తాన్ భూభాగం పరిధిలోకి వచ్చే లామ్ వ్యాలీలో ఒక పాక్ ఎఫ్-16 - మరో మిగ్ యుద్ధవిమానం కూలిపోయినట్టు సమాచారం.. ఎఫ్16 విమానం కూలడానికి ముందు పైలెట్ ప్యారాచూట్ సహాయంతో తప్పించుకున్నట్టు వీడియోను కూడా భారత్ మిలటరీ రిలీజ్ చేయడం విశేషం. ఇక పాకిస్తాన్ మాత్రం తాము కూడా రెండు భారత యుద్ధవిమానాలు కూల్చివేశామని.. ఒక పైలెట్ ను పట్టుకున్నామని పాక్ మిలటరీ చీఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. కానీ ఈ వాదనను భారత్ తోసిపుచ్చింది. పాక్ ప్రచారంలో నిజం లేదని భారత్ తెలిపింది. భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా ప్రపంచ దేశాలురద్దు చేశాయి. కొన్ని విమానాలను దారి మళ్లించాయి. మరికొన్ని గమ్యస్థానాలకు తిరిగి వెళుతున్న విమానాలు.