మొదలైన భారత్ బంద్: రైతులూ, సామాన్య జనం కూడా రోడ్లమీదకి

11:43 - January 8, 2019


భారత ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన రెండు రోజుల భారత్ బంది ఈరోజు ఉదయమే మొదలయ్యింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8, 9న భారత్ బంద్ నకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పారిశ్రామికవేత్తలను అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని వామపక్ష ప్రజా సంఘాలు విమర్శించాయి. 

 12 డిమాండ్లతో కూడిన ఒక పత్రాన్ని  కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి. రెండు రోజుల భారత్ బంద్‌కు 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించగా, ఆలిండియా కిసాన్ మహాసభ కూడా దీనిని స్వాగతించింది. ఈ సమ్మెలో భాగంగా రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపడుతున్నారు. కాగా  ఇప్పటికే బంద్‌లో పాల్గొనాల్సిందిగా ఆలిండియా బ్యాకు ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా సంఘాలు వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు పిలుపునిచ్చాయి. ట్రేడ్ యూనియన్ సంఘాలుINTUC, AITUC, HMS, CITU, AIUTUC, AICCTU, UTUC, TUCC, LPFమరియు SEWAలకు మద్దతు తెలపాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్ సంఘాలు బంద్‌క మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి.


ఈసారి బంధ్ లో ట్రేడ్ యూనియన్లు, కార్మికులతో పాటు సాధారణ ప్రజలూ, రైతులు కూడా పాలు పంచుకుంటున్నారు. పూర్తి రుణమాఫీ, నెలకు రూ.3,500 నిరుద్యోగ భృతి చెల్లించాలని రైతులు కోరుతున్నారు. పబ్లిక్ సెక్టార్, చిన్న తరహా పరిశ్రమలు, విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, బ్యాంకింగ్, బీమా రంగాల ఉద్యోగులు కూడా ఈ భారత్ బంద్‌లో పాల్గొంటున్నారు. కార్మిక సంఘాల భారత్ బంద్ పిలుపు మేరకు ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్, మరో 30 ప్రజా సంఘాలు కూడా జనవరి 8న అస్సాం బంద్‌కు పిలుపునిచ్చాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా ఈ బంద్ లో పాల్గొంటోంది. ఈ సమ్మెకు కొన్ని బ్యాంక్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. 


 ఈ రేండురోజుల పాటు జరిగే బంధ్ వల్ల చిన్న చిన్న తాత్కాలిక ఇబ్బందులు తప్పకపోయినా. ఇప్పటికి ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లని నేరవేర్చుకుంటే మాత్రం రైతులకూ, కార్నికులకూ, నిరుద్యోగంలో ఉన్న యువతకూ భవిశ్యత్తులో కొంత ఊరట లభించే అవకాశం ఉండటంతో సామాన్య జనం కూడా ఈ బంద్ ని స్వాగతిస్తున్నట్టే ఉన్నారు.