Beyond - అనురాధ బండి (కవిత)

02:13 - April 17, 2019

 

 

 

 

 

 

1.
విచిత్రానికి రెండుదారులు.
చిత్రంగా చెరోవేపూచేరతారు.
ప్రేమా అని మనసులులల్లుతారు.
కనుమరుగయ్యాక కానరాని కథలవుతారు.

2.
ఆపలేని శక్తేదో జొరబడుతుంది.
కాంతి పరుచుకున్న చీకటి 
వెలుగుకన్ను తెరుస్తుంది.
ఎవరు, ఎందుకో 
ఎలానో, అని..
మభ్యపడిఉన్న లోలోప్రపంచానికి తెలుస్తుంది.

3.
ముడుచుకుపోయిన హృదయాలు
పురివిప్పిననెమళ్ళలా నాట్యంచేస్తాయి.
తేలికైన భావాలు
పక్షుల్లా ఎగురుతాయి.
సంకేతం శాంతిదనీ స్వేచ్ఛదనీ 
రెక్కలువిప్పుకుని నినాదాలు చేస్తారు.

4
చరిత్రలు తవ్వాలని 
ఆసక్తిగా కదులుతాయి చేతులు.
ఆయుధం దొరకక 
సమాధినే చరిత్రనుకుంటారు వెర్రివాళ్ళు.

5.
అంతటా సమాధానాలే.
కావలసిన ప్రశ్నలు దొరకక 
పిచ్చివాళ్ళైపోతారు మనుషులు. 

                                            అనురాధ బండి