మళ్ళీ వివాదాన్ని రేపిన నాగబాబు: పబ్లిగ్గా బూతులు తిడుతున్నారు

17:27 - January 4, 2019

బాలయ్య బాబుకీ మెగా ఫ్యామిలీకి మధ్య జరిగే కోల్డ్ వార్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పే పని లేదు. టాలీవుడ్ లో ఈ దిగ్గజాల పోరు ఎప్పటినుంచో నడుస్తోంది. ఇక అభిమానుల వార్స్ సరే సరి. అయితే కొంతకాలంగా మరుగున పడ్డ ఈ వివాదాలని నాగ బాబు మళ్ళీ పైకి తెచ్చి వదిలారు. డైరెక్ట్అ గా బాలయ్య కొత్త సినిమా "మహానటుడు" గుర్తోచ్చేలా. ఒక వ్యంగ్య కవితని ఫేస్ బుక్ లొ, ట్విట్టర్లొ పోస్ట్ చేసాడు.అయితే నాగబాబు ఈ పోస్ట్ పెట్టటం వెనుక సినిమాలో మెగాస్టార్ ని కించపరిచే వ్యాఖ్యలేమైనా ఉన్నాయా అనే అనుమానం కూడా తలెత్తుతోంది. ఇంతకీ నాగబాబు ఏందుకలా స్పందించారో గానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అభిమానుల మధ్య ఘర్షణలు జరిగే చాన్స్ కూడా ఉందనేది సినీ ప్రముఖుల భయం. 

ఇంతకీ నాగబాబు ఏం చేసారంటే.. 
 
కట్టుకథలు కొన్ని 
కల్పనలు కొన్ని 
చుట్టనేల..మూట కట్టనేల
నిజం కక్కలేని బయో పిక్కులొద్దయా
విశ్వదాభి రామ వినిరవేమ.... అంటూ రాయటమే కాకుండా "మాకూ కవిత్వాలు వచ్చండోయ్" అంటూ కింద బ్రాకెట్ లో రాసారు.అంతే కాదు దాన్ని తన ఫేస్ బుక్ వాల్ మీద పోస్ట్ కూడా చేసారు. అంతే ఇక మొదలయ్యింది ఆయన పోస్ట్ కింద రచ్చ. 
"కత్తి కూతలు కొన్ని..
శ్రీరెడ్డి బూతులు ఇంకొన్ని..
ఆరంజ్ తీయనేల..కొణిదెల గబ్బును కెలకనేల..
ఉరేసుకుంటా అనే క్రీమ్ బన్నులు మనకొద్దయా..
విశ్వధాభిరామ..
ఈ కులగజ్జిగాళ్లు మనకొద్దురా మామా..
(కవిత్వాలు అందరికీ వచ్చురా జబర్దస్త్ పందిబాబు)" అంటూ ఒకరు కామెంట్ చేస్తే. 
"నీది ఏ మాత్రం తప్పులేదు. మీ అమ్మ నాన్న పెంచిన సంస్కారం అలాంటిది. ముగ్గురు అన్నా దమ్ములను కని పెంచి వదిలారు. మీరు మరొక దండుపాళ్యం బ్యాచ్ ని కని మామీదకు వదిలారు.. వాళ్ళు సినిమాలలో పెట్టె ఎక్స్ప్రెషన్ తెలుసుకోవడానికి ఒక అరగంట పడుతుంది. 
ఇక నీ గురించి చెప్పాలి అంటే.. ఎగ్జాం ఎలా రాసావు? అని టీచర్ అడిగితే పెన్ తో రాసాను.. అని స్టూడెంట్ చెప్పే సమాధానానికి కూడా పళ్ళు వెకిలించి నవ్వే నీకు నీ సంస్కారానికి ఒక నమస్కారం.." అంటూ ఇంకొకరు, 
"పార్టీ పెట్టి సంకనాకించి
ఆరంజ్ తీసి పల్ప్ తీసిన పైకానా పండు వై
ఆత్మహత్య అంచుల్లో కి వెళ్లి సిగ్గు యెర్గాక
విశ్వదాభిరామ , 
విషయం వీకు ర మామా
రాసుకోరా సాంబ మాకు కండ కావరం తో కూడిన కవితలు వచ్చిఅండి ఆయ్" అంటూ రకరకాలుగా కమెంట్ బాక్సులో నాగబాబుగారిని డైరెక్ట్ గానే విమర్షించారు. మరో పక్క నాగబాబు చేసిన వ్యాఖ్యలకు సపోర్ట్ తెలుపుతూ మరికొంతమంది. వచ్చారు వెరసి అక్కడే కామెంట్ల యుద్దం జరుగుతోంది. అయినా ఇప్పుడు ఉన్నట్టుండీ ఇలా విమర్హకు దిగటం వెనుక మరేదైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ టాప్ చర్చ. అభిమానుల మధ్య గొడవలు రేగకుండా ఎన్ని విమర్శలు చేసినా పరవాలేదు గానీ ఇలా చేసే చిన్న చిలిపి పనికి కూడా భారీ మూల్యం చెల్లించి రావచ్చేమో. ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కుంటారో నాగబాబు...