లక్ష్మి పార్వతి ఊసే లేని "మహానాయకుడు" ట్రైలర్

19:32 - February 16, 2019

 

 

 

 

 

 

 

 

 

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించారు. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా రూపొందించగా తొలి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' సంక్రాంతికి విడుదలైంది. రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.తొలి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది. బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.. దీంతో కథానాయకుడు నష్టాలను మహానాయకుడుతో పూరించేందుకు ఫిబ్రవరి 22న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు. 


 ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ఈసారి ఎమోషనల్ కంటెంట్ గట్టిగానే వునట్లుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ తో పాటు రానా పాత్ర ఈ చిత్రంలో హైలైట్ కానుంది. మొత్తానికి ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. ఇక ఈచిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ముందు అసలు మహానాయకుడికి ట్రైలర్ లేదు అన్నారు కానీ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో సినిమాపై హైప్ పెరగాలంటే కచ్చితంగా ట్రైలర్ రావాల్సిందే.. అందుకే ప్రత్యేకంగా మహానాయకుడు ట్రైల‌ర్ సిద్ధం చేయించాడు క్రిష్. క‌థానాయ‌కుడుతో పోలిస్తే ఈసారి కాస్త మసాలా పెంచాడు దర్శకుడు. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను ఎక్కువ‌గా జొప్పించాడు. భజన కూడా ఎక్కువ కాకుండా చూసుకున్నాడు ఇవన్నీ పక్కన పెడితే 1983లో ఎన్టీఆర్ పార్టీ పరిస్థితులను ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఎలా ఎదిగాడు అనే విధానాన్ని చూపించాడు. అయితే ట్రైలర్ లో ఎక్కడా "లక్ష్మీ పార్వతి క్యారెక్టరే కనిపించక పోవటం గమణార్హం". 
 
ఎన్టీఆర్ కథానాయకుడులో మిస్ అయిన ఎమోషన్ సీన్లను మహానాయకుడులో క్యారీ చేశారు బాలయ్య. ముఖ్యంగా ఆయన పాలిటిక్స్‌లోకి రావడం.. తెలుగుదేశం పార్టీని స్థాపించడం.. ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టడం లాంటి సన్నివేశాలను ఎమోషనల్‌గా చూపించారు. చంద్రబాబుగా దగ్గుబాటి రానా.. హరిక్రిష్ణగా కళ్యాణ్ రామ్‌లు ట్రైలర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ఉన్నారు.  తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ 'యూ' సర్టిఫికెట్ కూడా పొందింది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్, విద్యాబాల‌న్‌ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఎం.ఎం కీర‌వాణి సంగీతం అందించారు. నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్‌బీకే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై ఎన్టీఆర్ సినిమాను నిర్మించారు.