నా కొడకా అంత మెజార్టీ రాకపోతే ఏసిపాడదొబ్బుతా: బాలకృష్ణ

15:31 - April 4, 2019

 

 

 

 

 

 

 

 

 

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కి మళ్ళీ మీడియాకి ఒక ట్రెండింగ్ వీడియో ఇచ్చారు. మొన్నటికి మొన్న ఒక టీవీ రిపోర్టర్ ని బెదిరిస్తూ బాంబులేస్తా, కత్తితిప్పుతా అన్న బాలకృష్ణ ఈసారి సొంత పార్టీ కార్యకర్తపైనే చిరాకు చూపించారు. ఎన్నికల రోడ్ షోలో పీక కోస్తా, ఏసేస్తానంటూ చుట్టూ వందలాది మంది కార్యకర్తలు చూస్తుండగానే కోపాన్ని చూపించారు ఫలితంగా ఇప్పుడు మళ్ళీ  బాలయ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ  ఎన్నికల ప్రచార రథంపై వెళుతుండగా ఓ కార్యకర్త ఈ ఎన్నికల్లో మీకు వేలల్లో మెజారిటీ వస్తుందంటూ అరిచాడు. మరో కార్యకర్త కూడా బాలయ్య ఈసారి 60 వేల మెజారిటీ అంటూ అరిచాడు.దానితో బాలకృష్ణ అంత మెజార్టీ వస్తుందారా అంటూ ఈసడించుకున్నారు.. ‘నా కొడుకా అంత మెజార్టీ రాకపోతే ఏసిపాడదొబ్బుతా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఇది మరీ ఆగ్రహంగా అన్న మాటకాదు మామూలుగా బాలకృష్ణ తన మామూలు ప్రవర్తనలో చూపించే చిరాకు వంటిదే. 

ఇలా మాటలతో హైప్ చేసేవ్ వారి పీక కోయాలంటూ సైగలు చేస్తూ భార్య వసుంధరతో బాలయ్య చెబు తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాకు కనుక అంత మెజార్టీ రాలేదనుకో. నీ పేరు - అడ్రస్ చెప్పరా. గెలవకపోతే పీక కోస్తా. ఏసీ పాడదొబ్బుతా అంటూ టీడీపీ కార్యకర్తపై బాలయ్య వ్యాఖ్యానాలు చేయడం వీడియోలో కనిపించింది. ఇప్పుడీ వీడియో మళ్ళీ వైరల్ గా మారి షేర్ అవుతూనే ఉంది. 

అయినా మరీ 60, 70 వేల మెజారిటీ కూడా రాదనే భయం లో ఉన్న బాలకృష్ణ ఇక అక్కడ గెలుపుమీద ఆశలు వదులుకున్నట్టేనా? అని ఇప్పుడు ఇతర పార్టీ అభిమానులు వ్యాఖ్యానించటం చూస్తూంటే నిజంగానే హిందూపురంలో బాలకృష్ణ గట్టి పోటీనే ఎదుర్కోబోతున్నాడనిపిస్తోంది. గతంలోనూ ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉండి పెద్దగా చేసిందేమీ లేదన్నది ఎక్కువగా వినిపించింది.