"వర్మ" నుంచి తప్పుకున్న బాలా: తమిళ అర్జున్ రెడ్డి ఆగిపోయింది

22:20 - February 7, 2019
*ప్రాజెక్టు నుంచి తప్పుకున్న దర్షకుడు బాలా 
*ఇప్పటి వరకూ తీసినది మొత్తం రీషూట్ 
*అధికారికంగా తెలిపిన ప్రొడక్షన్ హౌస్ 

 

 

తెలుగులో "అర్జున్ రెడ్డి" హవా ఇప్పటికీ నడుస్తూనే ఉంది, సినిమా వచ్చి ఇన్నాళ్ళైనా విజయ్ దేవరకొండ ఇంకా అదే స్టామినాతో నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు తెలుగులో దర్శకత్వం చేసిన సందీప్ రెడ్డి వంగా తోనే హిందీలో కూడా రీమేక్ అవుతున్న ఈ సినిమా తమిళం లోమాత్రం సీనియర్ దర్శకుడు బాలా చేతిలో పడింది టైటిల్ కూడా "వర్మ" అని పెట్టారు,

 అయితే ఇప్పటి వరకూ బాలా సినిమాలు చూసిన జనాలందరికీ వచ్చిన డౌట్ ఒక్కటే "బాలా గొప్ప దర్శకుడే కానీ... ఈ సినిమాకి సరైన ఎంపికేనా?" అని ఎవ్వరి అంచనాలనూ బ్రేక్ చేయకుండా "ట్రైలర్"తోనే తానేమిటో నిరూపించేసాడు. టీజర్, ట్రైలర్ రెండూ విపరీతంగా నిరాశ పరిచాయి, ఆల్రెడీ అర్జున్ రెడ్డి సినిమాను చూసిన తమిళ ప్రేక్షకులది ఒక రకం అయితే ఇక మనవాళ్ళ ట్రోలింగ్  ఇంకో ఎత్తు. 
 
దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ‘ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్’ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సినిమాను కొత్త నటీనటులు, మరో దర్శకుడితో రీ షూట్ చేస్తున్నట్లు ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. ‘‘ఇప్పటివరకూ చిత్రీకరించిన ‘వర్మ’ సినిమాతో మేము తృప్తి చెందలేదు. కాబట్టి ఈ సినిమాను విడుదల చేయడం లేదు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వర్షన్‌ను మళ్లీ సరికొత్తగా షూటింగ్ చేయాలని నిర్ణయించాము. ఇందులో ధృవ్‌నే హీరోగా కొనసాగిస్తాము. కానీ మిగతా నటీనటులను, దర్శకుడిని కొత్త వారిని తీసుకుంటాము. కొత్త నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తాము.

ఈ మార్పు చేయడంతో మాకు చాలా నష్టం జరుగుతుంది. కానీ ఆ అద్భుతాన్ని చెడగొట్టకూడదనే ఈ పని చేస్తున్నాం. కొత్త జట్టుతో రేయింబవళ్లు కష్టపడి ఈ సినిమా 2019, జూన్‌లో విడుదల చేస్తాము. మాకు మీ మద్దతు కావాలి’’ అని ఓ లేఖని నిర్మాణ సంస్థ విడుదల చేసింది. పాపం మొత్తానికి బాలా ఇలా అయిపోయాడన్న మాట. ఏమాటకామాట చెప్పుకోవాలంటే  బాలా గొప్ప దర్శకుడే కావొచ్చు కానీ "అర్జున్ రెడ్డి" లాంటి సినిమాకి మాత్రం ఆయన కరెక్ట్ కాదేమో...