బాహుబలి-2 రికార్డుకు బ్రేక్‌...

14:30 - February 6, 2019

ఇప్పటిదాకా రికార్డులు బ్రేక్‌ చేసిన బాహుబలి-2 చిత్రానికి బ్రేక్‌ పడింది. బాహుబలి-2 రికార్డును బ్రేక్‌ చేస్తూ...సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న సినిమా ' ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌ '.  కాగా '  ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్ ' మూవీ రూ.45 కోట్లతో రూపొందింది. 2016లో భారత సైన్యం పాకిస్థాన్‌పై జరిపిన మెరుపు దాడుల ఆధారంగా ఈ ' ఉరీ ' తెరకెక్కింది. జనవరి 11 న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ. 281.73 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
ఇప్పటివరకూ హిందీలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి-2 కొనసాగుతోంది. అయితే బాహుబలి -2 చిత్రం 23,24 రోజుల్లో సాధించిన వసూళ్లను 'ఉరీ 'చిత్రం బీట్ చేసేసింది. బాహుబలి-2 సినిమా 23వ రోజు కలెక్షన్స్ రూ.6.35 కోట్లు కాగా, 24వ రోజు రూ.7.80 కోట్లు వసూళ్లు రాబట్టింది. అయితే' ఉరీ 'చిత్రం 23వ రోజు కలెక్షన్స్ రూ. 6.53 కోట్లు కాగా, 24వ రోజు రూ. 8.71 కోట్లు వసూళ్లు చేసింది. అంతేకాదు సినిమా ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో బాహుబలి-2 రికార్డును ' ఉరీ 'అధిగమించిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.