ప్రేమకి మరో ప్రాణం బలి: వేదింపులు తాళలేక యువతి ఆత్మహత్య

11:48 - April 13, 2019

*ప్రేమ పేరుతో యువకుడి వేధిం పులు తాళలేక

* ఫార్మసీ విద్యార్థిని ఆత్మ హత్య

*చట్టాలెన్నున్నా ఆగని వేదింపులు, మరణాలు 

 

ప్రేమ పేరుతో యువకుడి వేధిం పులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం. చెరుకూరి మల్లేష్‌ రెండో కుమార్తె  చెరుకూరి రుక్మిణి(20) హైదరాబాద్‌లో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఇదే గ్రామానికి చెందిన పవన్‌ కొంతకాలంగా రుక్మిణిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.  విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో పవన్‌ను అనేకసార్లు హెచ్చరించారు అయినా ఆ వేదింపులు మరింత తీవ్రంగా ఉండటంతో  అర్ధరాత్రి రుక్మిణి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

                                         

దీంతో పోలీసులు ఆమె మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. రుక్మిణి సూసైడ్ చేసుకున్న విషయం తెలుసుకున్న పవన్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. మృతురాలి తండ్రి మల్లేష్‌ ఫిర్యాదు మేరకు పవన్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ మోహన్‌ తెలిపారు