జబ్బున పడ్డ బీజేపీ: అరుణ్ జైట్లీకి క్యాన్సర్, అమిత్ షా కి స్వైన్ ఫ్లూ

13:35 - January 17, 2019

  
మన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ క్యాన్సర్ బారినపడ్డారు. దీంతో ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లారు. తొడ భాగంలో క్యాన్సర్ కణితి బయటపడింది. రెండువారాల పాటు వ్యక్తిగత సెలవుపై ఆయన న్యూయార్క్ వెళ్లారు. అరుణ్ జైట్లీకి 66 ఏళ్లు. ఇటీవలే కిడ్నీలకు చికిత్స జరిగింది. ఈనేపథ్యంలో క్యాన్సర్ చికిత్సను అరుణ్‌ జైట్లీ తట్టుకోగలరా అన్న అనుమానాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. 


న్యూయార్స్ లోనే ఆయన కేన్సర్ కు చికిత్స చేయించుకోనున్నారు. అయితే ఇక్కడే సమస్య ఉందని వైద్యులు సూచిస్తున్నారట. కేన్సర్ ను గుర్తించి ఆపరేషన్ చేస్తే ఆయన మూత్రపిండాలపై ఎఫెక్ట్ పడి ప్రాణాలకే ప్రమాదమట. అందుకే ఆపరేషన్ చేయలేమంటున్నారు. కీమో థెరపీ ఆయన బాడీ సహకరించదని వైద్యులు తేల్చారు. దీంతో మందులతోనే తగ్గించాల్సిన పరిస్థితి. అయితే మందుల వల్ల మృదుకణజాల కేన్సర్ లొంగే అవకాశాలు లేవట.. శరీరం మొత్తం వేగంగా వ్యాపించే వ్యాధి కావడంతోనే ఆయన అమెరికాలో అత్యున్నత వైద్య సంస్థకు బయలు దేరారు. బీజేపీలోనే అత్యంత ధనవంతుడైన నేతగా పేరొందిన అరుణ్ జైట్లీ ఈ వ్యాధి రావడంపై ప్రధాని మోడీ - ప్రతిపక్ష నేత రాహుల్ అంతా అంతా సానుభూతి తెలిపారు. 

ఇదిలా ఉంటే ఇదే సమయం లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. ప్రాణాంతక స్వైన్‌ ఫ్లూ బారినపడ్డారు. అస్వస్థతకు గురైన ఆయన దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఎయిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తనకు స్వైన్‌ ఫ్లూ వచ్చిన విషయాన్ని అమిత్ షా బుధవారం (జనవరి 16) రాత్రి ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘నాకు స్వైన్ ఫ్లూ వచ్చింది. దానికి సంబంధించిన చికిత్స కొనసాగుతోంది. ఈశ్వరుడి దయ, మీ అందరి ప్రేమ, అభిమానాలతో త్వరగా కోలుకుంటా’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బదులిస్తూ.. ఈశ్వరుడు మీకు త్వరగా స్వస్థత చేకూరుస్తారని పేర్కొన్నారు.

ఇక ఈ ఇద్దరూ అనుకుంటే కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఇదే సమయంలో  ముక్కుకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ఇలా బీజేపీ నేతల ఆనారోగ్య పరిస్థితులు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. ఎందుకో  అటు బీజేఅపీ పార్టీ, ఇటు బీజేఅపీ నేఅతలూ ఒకే సారి జబ్బు పడుతున్నారు