హనీట్రాప్ లో పడ్డ ఇండియన్ ఆర్మీ: రక్షణ రహస్యాలని పాక్ కి చేరవేశారు

11:32 - January 14, 2019

ఆడ పిల్ల చాట్ చేస్తూందనగానే ఒళ్ళు మరిచి పోయారు మన సైనికులు. అసలు ఎవరికీ ఇవ్వకూడని మన రక్షణ రహస్యాలను సైతం పాక్ ఇంటలిజెన్స్ చేతుల్లోపెట్టారు. తన పేరు అనికా చోప్రా అనీ, మిలటరీ నర్సింగ్‌ గ్రూపునకు కెప్టెన్‌ అనీ పరిచయం చేసుకుందో అమ్మాయి. ఫేస్బుక్ లో తన ఫొటోలని చూసి ఒక్కొక్కరుగా పడిపోయారు మన సైనికులు. అలా ఒక్కరూ ఇద్దరూ కాదు 50మందికి పైకా కీలక స్థావరాల్లో పనిచేసే సైకులని టర్గెట్ చేసిందా అమ్మాయి. అయితే ఆమెతో పర్సనల్ చాట్ అంటూ మునిగిన మనవాళ్ళు అసలు ఆమె ఎవరో ఏమిటో అనికూడా ఆలోచించకుండా. సైనిక రహస్యాల్ని చేరవేసారు. 

ఆమెతో మాట్లాడుతున్న జవాను సోమ్‌వీర్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చి ఉన్నతాధికారుల నిఘా పెట్టడంతో ఆమె అసలు గుట్టు బయటపడింది. ఆమె పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐకు చెందిన మహిళగా తేలింది. దాంతో ఉన్నతాధికారులు ఆ జవానును అరెస్టు చేశారు. ఆమె వలపు వలలో అతడొక్కడే కాకుండా సుమారు మరో 60 మంది వరకూ చిక్కుకున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రాజస్థాన్‌లోని ట్యాంక్‌ రెజిమెంటులో పనిచేస్తున్న సోమ్‌వీర్‌కు 2016లో అనికా చోప్రా అనే పేరుతో ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. తనకు మిలటరీ అంటే ఇష్టమని, జవాన్లంటే గౌరవమని చెబుతూ అతడితో సన్నిహితంగా మెలగసాగింది. కొద్ది రోజులకు అతడి ప్రవర్తనపై తోటి జవాన్లకు అనుమానం రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు సోమ్‌వీర్‌పై నిఘా పెట్టడంతో ఆ మహిళ అసలు రంగు బయటపడింది. వారిద్దరి మధ్య సాగిన సంభాషణలు విశ్లేషించిన అధికారులు.. మిలటరీకి సంబంధించిన విలువైన సమాచారాన్ని సోమ్‌వీర్‌ ఆ మహిళకు పంపినట్టు గుర్తించారు. దాంతో రాజస్థాన్‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి, శనివారం కోర్టులో హాజరు పరచారు. 18 వరకూ అతనికి రిమాండ్ విదించింది కోర్టు. అయితే విచారణలో మరికొన్ని కీలక రహస్యాలని కూడా ఆ అమ్మడు చెవిలో వేసినట్టు చెప్పేసాడు మన వీర జవాను. 

మీ ఆర్మీ యూనిట్‌కు సంబంధించిన మ్యాప్, వాహనాలు, ఆయుధాలకు సంబంధించిన చిత్రాలు ఉంటే పంపించు.. మీ యుద్ధ ట్యాంకులకు సంబంధించిన ఫొటోలు ఉంటే పంపిస్తావా? ఫీల్డ్ ఫైరింగ్‌ను ఎప్పుడు నిర్వహిస్తారు? సైనిక విన్యాసాల చిత్రాలు పంపించు.. అంటూ సోమ్‌వీర్‌కు వరుసగా సందేశాలు పంపింది. అప్పటికే పూర్తిగా అనికా చోప్రా ఆధీనంలోకి వెళ్లిపోయిన సోమ్‌వీర్ ఆర్మీ రహస్యాల్ని ఒక్కొక్కటిగా చేరవేశాడు. ఇతర స్థావరాల వివరాలు, ఫొటోలు కావాలని కూడా ఆమె అడిగింది. అలాగే భార్యను వదిలిపెట్టి తనను పెండ్లి చేసుకోవాలంటూ సోమ్‌వీర్‌పై ఒత్తిడి పెంచింది. పలు సందర్భాల్లో అతడిని బెదిరించే ప్రయత్నం చేసింది. కొంతకాలంగా సోమ్‌వీర్ ప్రవర్తన తేడాగా ఉండడం, ఎక్కువ సేపు సోషల్‌మీడియాలో చాటింగ్ చేస్తుండడంతో అనుమానం వచ్చిన తోటి జవాన్లు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాలు, రాజస్థాన్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం సోమ్‌వీర్‌పై ఐదు నెలలుగా నిఘా పెట్టింది. అతడి ఫేస్‌బుక్ ఖాతాలను పరిశీలించి నిర్ఘాంతపోయింది. అనికా చోప్రా పేరుతో ఆర్మీలో ఏ అధికారిణి లేరని, ఇది పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పని అని తేలింది. అంతే కాదు ఆమె ఐఎస్సై మనిషి అని తెలిసి కూడా 5 వేల రూపాయలకు కక్కుర్తిపడ్డాడు. అమె ఇవ్వదలిచిన డబ్బులని తన తమ్ముడు ఖాతాకు బదిలీ చేయించాడు. 
    అయితే ఇతని పై నిఘా ఉంచి సదరు అమ్మాయి ఫేస్బుక్ ఖాతా ని పరిశీలించిన అధికారులకు మరికొంతమంది భారత జవాన్లు ఆమె ఖాతాలో కనిపించటం తో అవాక్కయ్యారు. నెమ్మదిగా ఒక్కొక్కరినీ విచారించబోతున్నారట.  

ఈ తరహా విధానాన్ని హనీ ట్రాపింగ్ అంటారట. ఇదంతా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కుట్ర అని, అనికా చోప్రా పేరుతో నకిలీ ఖాతాను సృష్టించి జవాన్లను ఉచ్చులోకి దించారని గుర్తించారు.