వర్మ కాదు ఆదిత్య వర్మ : తమిళ అర్జున్ రెడ్డి రీషూట్, ఫస్ట్ లుక్

15:48 - February 20, 2019

*రీ షూట్ లో తమిళ అర్జున్ రెడ్డి టైటిల్ వర్మ కాదు ఆదిత్య వర్మ 

*టైటిల్ ఫిక్స్ చేసి ధృవ్ లుక్ కూడా విడుద‌ల

* జూన్‌లో విడుదల అయ్యే అవకాశం 

 

తెలుగు హిట్‌ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌ ‘వర్మ’ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తయింది. అవుట్‌పుట్‌ నచ్చక మళ్లీ ఈ సినిమా తీయాలని నిర్మాతలు అనుకున్న విషయం తెలిసిందే. సినిమా మొత్తం పూర్తయ్యాక అసలు ఔట్పుట్ నచ్చక ఈ సినిమాను మళ్ళీ కొత్త నటీనటులు, మరో దర్శకుడితో రీ షూట్ చేస్తున్నట్లు E4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది.  "ఇప్పటివరకూ చిత్రీకరించిన ‘వర్మ’ సినిమాతో మేము తృప్తి చెందలేదు. కాబట్టి ఈ సినిమాను విడుదల చేయడం లేదు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వర్షన్‌ను మళ్లీ సరికొత్తగా షూటింగ్ చేయాలని నిర్ణయించాము. ఇందులో ధృవ్‌నే హీరోగా కొనసాగిస్తాము. కానీ మిగతా నటీనటులను, దర్శకుడిని కొత్త వారిని తీసుకుంటాము. కొత్త నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తాము." అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 
అనుకున్నట్టుగానే ఈ స్నిమా రీషూట్ స్టార్ట్ చేసేస్తున్నారు ఈ చిత్రం ధృవ్ విక్ర‌మ్‌ ప్ర‌ధాన పాత్ర‌లోనే తెర‌కెక్క‌నుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న అక్టోబ‌ర్ చిత్ర ఫేమ్ బానిటా సందుని ఎంపిక చేశారు. ఇక సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీ శాయ రీమేక్‌కి ద‌ర్శ‌కుడిగా ప‌ని చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ధృవ్ లుక్ కూడా విడుద‌ల చేశారు.  ఈ రీ షూట్ కు డబ్బులు మొత్తం హీరో విక్రమ్ స్తున్నారని ప్రచారం జరుగుతుంది.  సినిమా మొత్తం తెరకెక్కించిన తర్వాత అవుట్ పుట్ నచ్చక మళ్లీ సినిమా మొత్తం రీ షూట్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు.అలాగే తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన రధన్‌నే ‘ఆదిత్యవర్మ’కు మ్యూజిక్‌ అందించబోతుండటం విశేషం. ఇక సినిమాటోగ్రాఫర్‌గా ర‌వి కె చంద్రన్ ప‌ని చేయ‌నున్నారు. రవి కె చంద్రన్ తనయుడు సంతన కృష్ణన్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌ "కబీర్ సింగ్"కి సినిమాటోగ్రఫీ అందించ‌డం విశేషం.ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా కంప్లీట్‌ చేసి జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.