ఆర్మీలో నా సీనియర్ అధికారి నన్ను రేప్ చేసాడు:భద్రతా దళాల్లో స్త్రీకి భద్రత లేదు

00:17 - March 8, 2019

*రక్షణ రంగంలోనే మహిళలకు రక్షణ లేదు, నోరువిప్పిన  మార్తా 

*నన్ను ఒక సీనియర్ అధికారి రేప్ చేసాడు

*యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్

 

రక్షణ రంగంలోనే తమకు రక్షణ లేదంటూ ఎప్పటినుంచో ఉన్న ఆరోపణలకు మరో ఆధారం తోడయ్యింది. అమెరికా రక్షణ విభాగంలో పనిచేసే మహిళలకు కనీస భద్రత కరువయ్యింది అమెరికన్ సైన్యంలో పనిచేసే మహిళలపై లైంగిక దోపిడీ, అత్యాచారాలు, లైంగిక దాడులు ఏటేటా గణనీయంగా పెరుగుతున్నాయి. ఒక్క 2017లోనే లైంగిక దాడి ఘటనలు 10 శాతం మేరకు నమోదయ్యాయి. 


తాజాగా తాను కూడా అత్యాచారానికి, లైంగిక దాడికి గురయ్యానని అరిజోనా సెనెటర్ మార్థా మెక్ శాల్లీ వెల్లడించారు. గతంలో ఆమె వైమానిక దళంలో ఉండి యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్ గా గుర్తింపు పొందారు. తరువాత రిపబ్లికన్ పార్టీ తరఫున అరిజోనా నుంచి ఆమె సెనెటర్ గా ఎన్నికయ్యారు. వాయుసేనలో 26 ఏళ్ళ పాటు సేవలందించిన ఆమె . అమెరికా వైమానిక దళంలో చేరిన తొలి రోజుల్లో తాను అత్యాచారానికి గురయ్యానని చెప్పారు. తన పై అధికారులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, అయితే అనేక కారణాల వల్ల తాను ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేదని, లైంగిక దాడి కొనసాగినప్పటికీ తాను కొన్నేళ్ల పాటు మౌనంగా భరించినట్లు పేర్కొంన్నారు. 


 ఆసమయంలో నేనే నేరస్తురాలిని అన్న భావనలో ఉండి పోయాను, ఎందరో బాదిత మహిళలూ, పురుషుల మాదిరిగా నేనూ ఈ వ్యవస్థని నమ్మే స్థితిలో అప్పుడు లేను. ఆ సమయంలో అవమానంతో, అయోమయంతో ఉన్నాను. ఆ విషయాలని బయటికి చెప్పకుండా ఉండటం ద్వారా నేను మానసికంగా బలంగా ఉన్నానని భావించాను. కానీ నన్ను ఒక సీనియర్ అధికారి రేప్ చేసాడు, అన్యాయంగా నన్ను అక్కడ దోషిని చేసారు" అంటూ ఆమె అప్పటి సంఘటనలని బయట పెట్టారు. అయితే సైన్యంలో ఇలాంటి సంఘటనలు, మరికొన్ని కుంభకోణాలూ బయట పడటంతో నేనూ బాదితు రాలినే అని చెప్పాలని అనుకున్నాను అంటూ అంటూ ఆమె ఆవేదనతో ఆ అనుభవాన్ని పంచుకున్నారు. మిలటరీ దారుణాలు తెలియాలనే తాను నోరు విప్పానని, తనలాగా చాలా మంది మహిళా బాధితులు సైన్యంలో ఉన్నారని తెలిపిన ఆమె. ఎదురు తిరిగితే కీలక బాధ్యతలను అప్పగించకుండా దూరం పెట్టారని విమర్శించారు.