నాకు విశ్రాంతి ఇచ్చేందుకే: శంకర్ పై రెహమాన్ సాఫ్ట్ సెటైర్

17:40 - February 2, 2019

పదేళ్ల క్రితం ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరంటే విన్పించే మొదటి పేరు శంకర్.  సాధారణంగా శంకర్ సినిమాలు అన్నింటికి ఏఆర్ రెహ్ మానే సంగీతం అందిస్తున్నాడు. జెంటిల్ మ్యాన్ సినిమా దగ్గరనుంచి.. 2.0 వరకు ఇద్దరి కాంబినేషన్ లో అద్భుతమైన పాటలు వచ్చాయి.  శంకర్ 2.0 తర్వాత ఇప్పుడు భారతీయుడు 2 స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ ని కాదని.. అనిరుథ్ కి అవకాశం ఇచ్చాడు శంకర్. భారతీయుడు 2 సినిమాకు అనిరుథ్ పేరుని అలా ఎనౌన్స్ చేశారో లేదో.. సోషల్ మీడియాలోఇలా పుకార్లు స్టార్ట్ అయిపోయాయి. ఏఆర్ రెహ్మాన్ లో జ్యూస్ అయిపోయిందని… అందుకే శంకర్ తెలివిగా పక్కన పెట్టేశాడని వార్తలు వచ్చాయి. మరోవైపు.. శంకర్ సినిమాలు మరీ మూసగా ఉంటున్నాయని.. ఏఆర్ రెహమానే తప్పుకున్నాడని కూడా పుకార్లు విన్పించాయి. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు రెహమాన్ బాగా అప్ సెట్ అయ్యాడు. అందుకే క్లారిటీ ఇచ్చాడు. అసలు భారతీయుడు 2 సినిమాకు కమల్ హాసన్ ఆప్షన్ తానేనని.. కానీ శంకర్ మాత్రం అనిరుథ్ ని తీసుకునేందుకే మొగ్గుచూపాడని చెప్పారు. రోబో 2.0 సినిమాకు తాను బాగా ఆలసిపోయానని.. బహుశా అందుకే తనకు విశ్రాంతి ఇచ్చేందుకే అనిరుథ్ ని తీసుకుని ఉంటారని అన్నాడు రెహ్ మాన్. మొత్తానికి పుకార్లపై రెహ్ మాన్ క్లారిటీ ఇచ్చినా.. శంకర్ మాత్రం తనని వద్దనుకుంటున్నాడనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు ఏఆర్ రెహ్మాన్.