నారా భువనేశ్వరి టెలీటెలికాన్ఫరెన్స్ పై ఇంత చర్చ ఎందుకు?

04:10 - April 4, 2019

*చర్చల్లో సీఎం సతీమణి టెలీటెలీటెలికాన్ఫరెన్స్


*కుప్పం ఎమ్మెల్యేలతో భువనేశ్వరి మాటలపై చర్చలు ఎందుకు?


*భువనేశ్వరి రాకతో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయా? 

 

ఇప్పటివరకూ గెలుపు తమదే అన్న ధీమాలో ఉన్న టీడీపీకి ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందా? ఒక పక్క జగన్ కి పెరుగుతున్న పాజిటివ్ వైబ్రెషన్స్ ని టీడీపీ సీరియస్ గా తీసుకుందా? లైట్ తీసుకుందామనుకున్న పవన్ కళ్యాన్ కూడా బాబు గారిని భయపెడుతున్నాడా? తాజా పరిస్థితులని చూస్తూంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. కొన్ని నేల కిందటి వరకూ 2019 ఎన్నికలను లైట్ తీసుకున్న చంద్రబాబు తాజా పరిణామాలను చూసి కాస్త ఆలోచనలో పడ్డట్టే కనిపిస్తోంది. 


ఎన్నికల వేళ రాజకీయ నేతల కుటుంబీకులు కూడా ప్రచారాలకు పూనుకోవడం కొత్తది ఏమీ కాదు. ఈ విషయంలో ముఖ్య నేతల కుటుంబీకులు కూడా మినహాయింపు కాదు. ఇది గతం నుంచి ఉన్నదే. అనేక మంది నేతల కుటుంబీకులు ఎన్నికల ప్రచారం చేస్తూ తమ వారిని గెలిపించాలని ప్రచారం చేస్తూ ఉంటారు. ఏపీ రాజకీయంలో కూడా ఇది రొటీనే.
అయితే ఇంతవరకు ఎప్పుడూ చంద్రబాబు భార్య భువనేశ్వరి రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కుటుంబ నిర్వహణ, వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్న ఆమె ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై మానిటరింగ్ చేస్తున్నారు.

ఏకంగా వందమంది నాయకులతో ఒకేసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.ఆమె ఇంటింటి ప్రచారానికో - లేక రోడ్ షోల కో వెళ్లడం లేదు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుపు కోసం ఆమె ప్రత్యక్ష ప్రచారం కాకుండా.. వీడియో కాన్ఫరెన్స్ కు దిగడం విశేషం. కుప్పంలోని టీడీపీ కార్యకర్తలతో నారా భువనేశ్వరి ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. 

బాబుకు భారీ మెజారిటీ తీసుకురావాలని ఆమె వారికి ఉద్భోదించినట్టుగా తెలుస్తోంది. గతంలో పోలిస్తే ఈ సారి బాబుకు ఎక్కువ మెజారిటీ రావాలని లక్ష ఓట్ల మెజారిటీని తీసుకురావాలని ఆమె వారికి పిలుపునిచ్చారట. మొత్తానికి చంద్రబాబు నాయుడు సతీమణి ఇలా వీడియో కాన్ఫరెన్స్ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నట్టుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాటల్లో ఎక్కడా కాన్ఫిడెన్స్ లేకపోవడంతో నేతల్లోనూ భయం పట్టుకుంది. మనం ఎన్ని చేసినా ఎక్కడో అనుమానం ఉందంటూ ఆమె అనడంతో నాయకులు, కార్యకర్తల్లో మరింత ఆందోళన పెరుగుతోంది.

కుప్పం నియోజకవర్గ నాయకులు కూడా కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించడం చూస్తుంటే ఈ సారి అక్కడ టీడీపీ పరిస్థితి కష్టంగా ఉందని అర్థమైపోతోంది. తప్పులు జరిగాయని.. సరిచేసుకుందామంటూ అక్కడ ఇన్‌ఛార్జ్ నాయకులను కోరడం చూస్తుంటే వారిలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. ఆ విభేదాలు పార్టీ అధినేతను ఏ రేంజ్‌లో కలవరపెడుతున్నాయో స్పష్టమవుతోంది.  అంటూ కొన్ని మాటలు వినిపిస్తున్నా, ఎన్నడు రాజకీయాల్లో కనిపించని  ఆమె తేలీటెలీటెలికాన్ఫరెన్స్ ని ఇంట సీరియస్ తీసుకుంటున్నారు అంటే భువనేశ్వరి రాకతో నిజంగానే ప్రతిపక్షాలు కూడా భయపడుతున్నాయా?