పోలవరం పూర్తవ్వటం ప్రధానికి ఇష్టం లేదు: చంద్రబాబు నాయుడు 

10:31 - April 2, 2019

*పోలవరం ప్రాజెక్టు ఏటీఎం అయితే... అది డబ్బుల్లేని ఏటీఎం
*4500 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు 
*పోలవరం పూర్తవ్వటం ప్రధానికి ఇష్టం లేదు: చంద్ర బాబు నాయుడు 

 

ఎన్నికల హవాలో పార్టీల ఆరోపణలూ దానికి రీ-కౌంటర్లూ పడుతూనే ఉన్నాయి. సాధారణ సమయంలోకన్నా ఈ సమయం లో చేసుకునే ఆరోపణల్లో కాస్త ఆవేశం ఉండటం మామూలే. అయితే ఇప్పటికీ క్లారిటీ రాని విషయం ఒకటుంది దానిమీదే అటు ప్రధాని ఇటు ఏపీ సీయం చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్షలు చేసుకుంటున్నారు. అదే పోలవరం బడ్జెట్. ఒకపక్క మేము డబ్బులు ఇచ్చాము అని కేంద్రం అంటూంటే, మరోపక్క ఒక్క పైసాకూడా రాలేదు అంటారు చంద్రబాబు. తాజాగా మళ్ళీ ఒకసారి అదే విషయంలో ఒకరిపై ఒకరు విమర్షించుకున్నారు మోడీ - చంద్రబాబూ... 

                                                      

ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులను చంద్రబాబు తన సొంత అవసరాలకు వినియోగిస్తున్నారని - అవినీతికి పాల్పుడుతున్నారని ధ్వజమెత్తారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ చేసిన వ్యాఖ్య బాగానే వైరల్ అయ్యింది. ఈ సమయంలో కడప జిల్లా పులివెందులలో ప్రచారం చేస్తున్న చంద్రబాబు కూడా చాలా వేగంగానే రియాక్ట్ అయ్యారు.

పోలవరం ప్రాజెక్టు ఏటీఎం కాదని - అది ఏపీ ప్రజల పాలిట ఏటీడబ్ల్యూ అని చంద్రబాబు రివర్స్ పంచ్ సంధించారు. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అయితే... ఏటీడబ్ల్యూ అంటే ఏని టైం వాటర్ అట. ఇదే విషయాన్ని చెప్పిన చంద్రబాబు.. మోదీ చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్టు ఏటీఎం అయితే... అది డబ్బుల్లేని ఏటీఎం అని మరో పంచ్ సంధించారు. 

                                                      

ఈ దిశగా చంద్రబాబు వినిపించిన వాదనను చూస్తే... *పోలవరం మనకందరికీ ఏటీఎం అంట! అసలు ఏటీఎంల్లో డబ్బులే లేవు. పోలవరంలో కూడా డబ్బుల్లేవు. రూ.4500 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వట్టిపోయిన ఏటీఎంగా మార్చేసింది. పోలవరం పూర్తిచేయడం నరేంద్ర మోదీకి ఇష్టంలేదు. అనేక అడ్డంకులు సృష్టించాడు. నేనిప్పుడు హామీ ఇస్తున్నాను - డిసెంబరు లోపల ప్రాజక్ట్ పూర్తవుతుంది. మోదీ - కేసీఆర్ - జగన్... మీ ఇష్టం వచ్చింది చేసుకోండి! నా సత్తా ఏంటో చూపించి పోలవరం పూర్తి చేస్తా.

                                                    

ఇప్పుడు చెబుతున్నా.. పోలవరం అంటే 'ఏటీఎం' కాదు... యస్.. పోలవరం అంటే 'ఏటీడబ్ల్యూ'. 'ఏటీడబ్ల్యూ' అంటే ఎనీ టైమ్ వాటర్ ఇన్ ద స్టేట్. ఒక బటన్ ఆన్ చేస్తే ఏ ఊరికి కావాలనుకుంటే ఆ ఊరికి నీళ్లు వెళతాయి. కరెంటు మాదిరిగా నీటి భద్రత ఇచ్చే బాధ్యత నాదే. ఎక్కడ కుళాయి తిప్పినా నీళ్లే. 24×7 నీళ్లు తెప్పిస్తా. గుజరాత్ లో మీరు చేయలేకపోయారు నేనిక్కడ చేస్తున్నా అదే మీకు కుళ్లు" అంటూ మోదీపై చంద్రబాబు తనదైన శైలిలో సెటైర్లు సంధించారు.