అనుష్క ఇకపై ఆ సినిమాలకే పరిమితమవుతుందా?

12:15 - March 11, 2019

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అనుష్క 'బాహుబలి' చిత్రం తర్వాత ఇండియాస్ టాప్ స్టార్ గా గుర్తింపు దక్కించుకుంటుందని అంతా భావించారు. అయితే అది జరగలేదు. ఎందుకంటే అదే సమయంలో మరీ ఎక్కువ లావు అవ్వడంతో ఆమె సినిమాలకు దూరం అయ్యింది.  బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నా అనుష్కకు మాత్రం ఆ సక్సెస్ ఉపయోగపడింది లేదు. దీంతో...దాదాపు సంవత్సరం పాటు పూర్తిగా కెమెరాకు దూరంగా ఉన్న అనుష్క మళ్లీ ఇన్నాళ్లకు మొహానికి రంగు వేసుకునేందుకు సిద్దం అయ్యింది. ఈ సమయంలో ఈమెకు అన్ని లేడీ ఓరియంటెడ్ పాత్రలే దక్కుతున్నాయి. తెలుగులో ఈమె ఇప్పటికే ఒక చిత్రానికి కమిట్ అయ్యింది. ఆ సినిమాలో కీలక పాత్రలో మాధవన్ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కాకుండా స్వామి అయ్యప్ప కథాంశంతో తెరకెక్కబోతున్న చిత్రంలో కూడా అనుష్క నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయ్యప్పపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అనుష్కతో తీయబోతున్న సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. సంతోష్ శివన్ దర్శకత్వంలో ఈ చిత్రం మలయాళం తెలుగు తమిళం హిందీ కన్నడం భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.  త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది. అనుష్క అభిమానులు మళ్లీ గ్లామర్ గా ఆమెను చూడాలని కోరుకుంటూ ఉంటే ఆమె మాత్రం ఇలాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కమిట్ మెంట్ ఇస్తూ వస్తుంది. ప్రస్తుతం  అనుష్క ఉన్న పరిస్థితుల్లో ఆమెతో నటించేందుకు ఏ స్టార్ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు. అందుకే ఆమె ఇకపై ఇలాంటి సినిమాలకే పరిమితం అవ్వాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.