యాంకర్‌ ప్రశాంతిపై పోలీస్‌ కేసు....

12:02 - April 22, 2019

టీవీ యాంకర్‌ ప్రశాంతిపై పోలీసు కేసు నమోదైంది. తప్పతాగిన ప్రశాంతి అసభ్య ప్రవర్తనకు కేసు నమోదైనట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెలితే...ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తన స్నేహితులు పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌లతో కలిసి తప్పతాగి యాంకర్ ప్రశాంతి మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకు వెళ్లింది. ఇలా తాగి వెళినవాల్లు అక్కడ తోటి వీక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మ్యాచ్ చూడకుండా సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో ప్రశాంతి అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఓ వీక్షకుడు ప్రశాంతితో పాటు ఆమె స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు.