శ్రీముఖికి అంత ఆవేదన దేని గురించో?

12:10 - January 4, 2019

ప్రముఖ యాంకర్ శ్రీముఖికి ఏమైందో ఏమోగానీ చాలా ఆవేదనతో ట్వీట్ చేసింది. ''జనం మానవత్వాన్ని మరచిపోయారా? గతంలో చాలా మంది ఇదే ప్రశ్న నన్ను అడిగారు. కానీ నేను మాత్రం ఇప్పటివరకూ వారి అభిప్రాయంతో ఏకీభవించలేదు. కానీ వ్యక్తిగతంగా నాకు అనుభవమైన తరువాత మనం కలిసి ఉంటున్నాం.. జీవిస్తున్నాం అంటే దానికి డబ్బు ఒకటే కారణమనిపిస్తోంది. మనలోని మానవత్వమంతా కోల్పోయేలోపు ఈ ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తా '' అని శ్రీముఖి ట్వీట్‌లో పేర్కొంది. అసలు ఆమె ఆ ట్వీట్ చేయడానికి కారణమేంటో తెలియదు కానీ బాగా హర్ట్ అయి ట్వీట్ చేసినట్టు మాత్రం అర్థమవుతోంది.