పుకార్లకు పుల్ స్టాప్‌: భార్యా, బిడ్డను పరిచయం చేసిన యాంకర్‌ రవి

11:21 - February 4, 2019

యాంకర్‌ రవి గురించి పరిచయం అక్కరలేదేమో...దాదాపు తెలుగు వారందరికీ సుపరిచితుడే. అయితే ఇతని మీద పుకార్లు షికార్లు చేస్తుంటాయి. వీటన్నింటికీ రవి పుల్ స్టాప్‌ పెట్టేశాడు!. వివరాల్లోకి వెలితే...యాంకర్ రవి ప్రేమ, పెళ్లి విషయమై ఇప్పటికే చాలా రూమర్లు వినిపించాయి. యాంకర్ లాస్యతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడంటూ పుకార్లు షికారు చేశాయి. ఆమెకు పెళ్లై పోవడంతో,  అనంతరం శ్రీముఖితో కూడా ఏదో ఉందంటూ గుసగుసలు వినిపించాయి. ఇదిలా వుంటే రవికి పెళ్లైందని.. ఆయనకో కూతురు ఉందంటూ మరికొన్ని వార్తలు వినిపించాయి. ఈ పుకార్లును వింటున్న వారు ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక మొత్తం మీద రవిని పట్టించుకోవడమే మానేశారు. ఈ నేపథ్యంలో రవి సడెన్‌గా తన భార్య, కూతురుని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నా భార్య నిత్య,నా మూడేళ్ల కూతురు వియా ...అంటూ ముగ్గురు చర్చి నుంచి బయటకు వస్తున్న పిక్‌ను షేర్ చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు.. ' కంగ్రాట్స్.. బ్యాడ్ కామెంట్స్ గురించి పట్టించుకోవద్దు. ఎంజాయ్. నీ లైఫ్.. నీ ఫ్యామిలీతో కలిసి ఇచ్చే ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తోంది'  అంటూ కామెంట్స్ పెడుతున్నారు.