నిన్ను చూడకుండానే ప్రేమిస్తున్నా: గర్భంలో ఉన్న బిడ్దకి అమీజాక్సన్ ఏం చెప్పిందంటే

16:43 - April 1, 2019

ఎవడు, ఐ, 2.0 లాంటి మూవీస్‌లో నటించిన అమీ జాక్సన్ తాను గర్భవతినని ప్రకటించింది.అమీజాక్సన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అందరికి ఈ విషయాన్ని గట్టిగా అరచి మరీ చెప్పాలనుకుంటున్నా. నేడు బ్రిటన్ లో మదర్స్ డే. ఈ విషయం చెప్పడానికి మాతృదినోత్సవానికి మించిన సమయం మరొకటి లేదు. తనకు పుట్టబోయే బిడ్డని ఉద్దేశిస్తూ.. "నిన్ను చూడక ముందే ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టేశా. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నా" అని అమీ జాక్సన్ ఇంస్టాగ్రామ్ లో తనకు కాబోయో భర్తతో ఉన్న ఫోటోని షేర్ చేసింది

                                                                       

 మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటౌతో డేటింగ్ చేస్తున్న అమీ.. త్వరలోనే తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నది. ఈ మధ్యే జార్జ్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. జార్జ్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అమీ.. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలిపింది. అక్టోబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కూడా చెప్పింది. రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్‌మెంట్ రింగులు మార్చుకున్నది. బ్రిటన్‌కు చెందిన జార్జ్... హిల్టన్, పార్క్ ప్లాజా, డబుల్ ట్రీలాంటి లగ్జరీ హోటల్స్‌ను అతడు నిర్వహిస్తున్నాడు. 

                                                                        
మోడల్ గా కెరీర్ ఆరంభించిన అమీ జాక్సన్ 2010లో మద్రాసు పట్నం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. అమీ జాక్సన్ క్యూట్ లుక్స్ అందరిని ఆకర్షించాయి. ఆ తర్వాత పలు హిందీ, తమిళ చిత్రాల్లో అమీ జాక్సన్ నటించింది. అమీ జాక్సన్ కు సరైన విజయాలు దక్కలేదు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శత్వంలో కూడా అమీ జాక్సన్ రెండు చిత్రాల్లో నటించింది. ఐ, 2.0 చిత్రాలు భారీ బడ్జెట్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో అక్షయ్ సరసన సింగ్ ఈజ్ బ్లింగ్, నవాజుద్దీన్‌తో కలిసి ఫ్రీకీ అలీ సినిమాల్లో పని చేసింది. చివరిగా శంకర్ 2.0 మూవీలో రజనీకాంత్ పక్కన నటించింది. అమీ నటించిన కిక్ 2 మూవీ విడుదలకు సిద్ధమవుతున్నది.