అతని బౌలింగ్ అనుమానాస్పదం:  అంబటి రాయుడు పై ఐసీసీ ఆరోపణ 

11:45 - January 14, 2019


     భారత బ్యాట్స్‌మన్‌, పార్ట్‌టైం ఆఫ్‌ స్పిన్నర్‌ అంబటి రాయుడు బౌలింగ్‌ అనుమానాస్పదంగా ఉందని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రకటించింది. ఈమేరకు ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన తొలి వన్డే అనంతరం మ్యాచ్‌ అధికారుల బృందం తమకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. ఆ మ్యాచ్‌లో కేవలం రెండు ఓవర్లే వేసిన రాయుడు వికెట్‌ ఏమీ లేకుండా 13 పరుగులు ఇచ్చాడు.

 రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన అంబటి రాయుడి ‘బౌలింగ్ యాక్షన్’పై ఐసీసీలో ఫిర్యాదు నమోదైంది. అయితే ప్రస్తుతానికి బౌలింగ్‌ చేసేందుకు రాయుడుకు ఎలాంటి అడ్డంకులూ లేవు. ‘రాయుడు బౌలింగ్‌ను నిశితంగా పరిశీలిస్తాం. 14 రోజులపాటు అతడు బౌలింగ్‌ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేయవచ్చు. బౌలింగ్‌ పరీక్ష ఫలితాలు వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 46 మ్యాచ్‌ల వన్డే కెరీర్‌లో రాయుడు 20.1 ఓవర్లలో 41.33 సగటుతో మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరు టీ 20లు ఆడినా వాటిల్లో బౌలింగ్‌ చేయలేదు.


    అంతర్జాతీయ క్రికెట్‌లో రాయుడు తన బౌలింగ్‌ని కొనసాగించాలంటే 14 రోజుల వ్యవధిలో ఐసీసీ నిర్దేశించిన టెస్టుకి హాజరవ్వాలని ఆదేశించింది. ఆ టెస్టులో ఐసీసీ నిబంధనలకి అనుగుణంగా రాయుడు తన మోచేతిని వంచుతున్నాడా..? లేదా..? అనేది తేల్చి.. ఆ తర్వాత క్లియర్స్ ఇవ్వనున్నారు. అప్పటి వరకూ అతను బౌలింగ్ చేసే అవకాశం లేదు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం ఉదయం రెండో వన్డే జరగనుంది. 
"రాయుడు బౌలింగ్‌ను నిశితంగా పరిశీలిస్తాం. 14 రోజులపాటు అతడు బౌలింగ్‌ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేయవచ్చు. బౌలింగ్‌ పరీక్ష ఫలితాలు వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటాం" అని ఐసీసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.