బన్నీ పక్కన ఆ హీరోయిన్‌ ఫిక్సట!

12:25 - January 3, 2019

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.  కాంబినేషన్ ఫిక్స్ అయింది కాబట్టి ప్రీ-ప్రొడక్షన్ మొదలుపెట్టి హీరోయిన్ ఎంపిక పై ప్రస్తుతం గురూజీ కసరత్తు చేస్తున్నాడట. ఆయన ప్రతి సినిమాలోనూ టాప్ లీగ్ హీరోయిన్లనే తీసుకుంటాడు.. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు హాట్ బ్యూటీ కియారా అద్వాని ని జోడీగా కుదిర్చే ప్రయత్నాలలో ఉన్నాడట. ఇప్పటికే కియారాను ఈ విషయంలో సంప్రదించారట.  ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బన్నీ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత చాలా గ్యాప్ తీసుకోవడంతో ఈ సినిమా ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట.  బాలీవుడ్ హీరోయిన్ అయిన కియారా మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' లో హీరోయిన్ గా నటిస్తోంది.