మన్మథుడు 2: లాంచ్ అయ్యాడు , అదే మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా?

16:05 - March 25, 2019

*రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2

*కొంత సేపటి క్రితం ఈ సినిమాను లాంచ్ చేసారు 

*షూటింగ్ ఎక్కువగా యూరోప్ లోనే 

 

నాగార్జున కథానాయకుడిగా గతంలో వచ్చిన 'మన్మథుడు' భారీ విజయాన్ని అందుకుంది.16 ఏళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న కెరీర్ లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇప్ప‌టికీ ‘మ‌న్మ‌థుడు’ సినిమా టీవీల్లో వస్తున్నా టీఆర్పీలు బాగానే ఉంతాయి. అంతగా ఆకట్టుకున్న కామెడీ ఎంతర్టైనర్ ఆ సినిమా. అలాంతి సినిమాకి మళ్ళీ సీక్వెల్ అంటే కాస్త ఆలోచించాల్సిందే.. అయితే ఆ సాహసం చేయటానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తూనే  ఉన్నాడు నాగార్జున. తాజాగా ఆ ప్రయత్నం ఫలించింది.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధమైందని వార్తలు వచ్చాయి. అలాగే కొంత సేపటి క్రితం ఈ సినిమాను లాంచ్ చేశారు.ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా యూరోప్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  ఇక సినిమాలో చాలా కాలం తరువాత నాగార్జున సతీమణి అమల గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో నాగ్ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని టాక్. అందులో యువకుడిగా కనిపించే నాగ్ పాత్ర మెయిన్ హైలెట్ అని సమాచారం.

ముహూర్తం షాట్ కు అమల క్లాప్ కొట్టగా నాగ చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.  నాగార్జున సరసన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.  యాక్టర్ టర్న్డ్  డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు.  సుశాంత్ హీరోగా నటించిన 'చిలసౌ' చిత్రంతో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లను తెరకెక్కించగలనని నిరూపించుకున్న రాహుల్ కు ఇది భారీ అవకాశమే. అంతే కాకుండా రాహుల్ కు ఇదో ఛాలెంజ్ అని కూడా చెప్పవచ్చు. నాగార్జున కెరీర్లో 'మన్మధుడు' సినిమాను క్లాసిక్ గా చాలామంది అభివర్ణిస్తుంటారు. అలాంటిది రైటర్  త్రివిక్రమ్- డైరెక్టర్ విజయ భాస్కర్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ను రిపీట్ చేయడం కష్టమైన  విషయమే. మరిఎంతవరకూ ఆ ఫీట్ ను సాధించగలడో వేచి చూడాలి. 


చి..ల..సౌ..’ తర్వాత  రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తోన్న రెండో సినిమా. ఈ సినిమాను ఋX 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.  రోజు నుంచే ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌ను 15 రోజుల పాటు యూరప్‌లో పిక్చరైజ్ చేయనున్నారు. ఈ  సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో లక్ష్మి, వెన్నెల కిషోర్,రావు రమేష్, నాజర్, ఝాన్సీ,దేవదర్శిని నటిస్తున్నారు.