సినిమాకి డబ్బులివ్వలేదని తండ్రినే తగల బెట్టాడు: అగ్ర హీరో దురభిమాని ఘాతుకం

16:01 - January 10, 2019

సంక్రాంతి సీజన్ టాలీవుడ్ లో ఎలాగో అటు తమిళ ఇందస్ట్రీలోనూ అంతే. దాదాపుగా అగ్ర హీరోల సినిమాల మధ్య పోటీకి ఈ సీజన్ కీలకం. అయితే ఈసారి హీరో అజిత్, రజినీకాంత్ ఇద్దరూ ఒకేసారి పోటీ పడ్డారు, అదీ రెండు సినిమాల రిలీజులూ ఒకేరోజు. దాంతో ఇద్దరు హీరోల మధ్యా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అదీ మమూలుగా కాదు కత్తు తీసి పొడుచుకునేంత. 

వేలూరులోని ఓ థియేటర్‌ ముందు ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రెండు సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. అభిమానుల మాత్రం తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్‌ అంటూ దాడులకు తెగబడుతున్నారు. తమ హీరో సినిమా విడుదల సందర్భంగా ధియేటర్ల దగ్గర అజిత్‌ అభిమానులు హల్‌చల్‌ చేశారు. తమ అభిమాన నటుడి సినిమా పాటలకు డాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు. నాలుకపై కర్పూరం వెలిగించుకుని హారతులు పట్టారు.

ఇదంతా ఒక ఎత్తైతే సినిమా చూడటానికి డబ్బులివ్వలేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టాడో అజిత్‌ అభిమాని. కన్నతండ్రి అన్న ప్రేమ లేకండా పెట్రోల్‌పోసి తగుల బెట్టడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనకూడా తమిళనాడులోని వేలూరులోనే చోటుచేసుకుంది. పోలీసులు వివరాల మేరకు. అజిత్‌కుమార్‌ అనే వ్యక్తికి హీరో అజిత్‌ అంటే విపరీతమైన అభిమానం. అభిమాన నటుడి సినిమాను మొదటిరోజే చూడటం అతనికి అలవాటు.
 
గురువారం అజిత్‌ సినిమా "విశ్వాసం" సినిమా విడుదలైన సందర్భంగా మొదటిరోజే సినిమా చూడాలనుకున్న అజిత్‌కుమార్‌ తన తండ్రి పాండియరాజన్‌ను డబ్బులు అడిగాడు. కానీ పాండియరాజన్‌ ఒప్పుకోకపోవటంతో ఆగ్రహించిన అజిత్‌కుమార్‌ తండ్రిపై పెట్రోల్‌పోసి తగులబెట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో పాండియరాజన్‌ ముఖం కాలటంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజిత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.