మోడీ ఒక ఎద్దు, స్మృతీ ఇరాని ఆవు, యోగి దూడ: అజిత్‌ సింగ్‌ వ్యాఖ్యలు

06:58 - January 12, 2019

కొన్ని సార్లు నోటి దురుసు అనుకోని చిక్కులని తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకూ, రాజకీయ నాయకులకూ. జనం మధ్య మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రోత్స్సహంతో వొళ్ళు మరిచి ఏదో ఒక కామెంట్ చేయటం తర్వాత మీడియా చేసే ప్రచారానికి తలపట్టుకోవటం మామూలే. ఇప్పుడు కూడా  రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ) అధినేత అజిత్‌ సింగ్‌ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

      ఏకంగా దేశప్రధానిని "ఎద్దు" అనేశారు. అక్కడితో ఆగకుండా స్మృతీ ఇరాని ని "బలమైన ఆవు" అంటూ మరో సారి నోరు జారారు.  ఇప్పుడు గొడవ మొదలు కాగానే తలపట్టుకున్నారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేమిటంటే.  ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని ఆయన ఎద్దు–దూడ–బలిష్టమైన ఆవుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని కోసీకలాన్‌లో రైతులతో చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ.


           "తప్పుడు వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే ఐదేళ్ల తర్వాత మార్చగలిగే హక్కు ప్రజలకు ఉండటం నిజంగా ప్రజాస్వామ్యం గొప్పతనమే. మీ ఆవులు, ఎద్దులు, దూడలు ఈ మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వార్తాపత్రికల్లో చూస్తున్నాను. వాటిని మీరు స్కూళ్లు, కాలేజీ భవనాల్లో కట్టేస్తున్నారు. ప్రజలేమో వాటిని మోదీ–యోగి అని పిలుస్తున్నారు. మరికొందరేమో బాగా బలిష్టమైన ఆవు ఒకటి వచ్చిందని చెబుతున్నారు. స్మృతీ ఇరానీ కూడా ఈ మధ్య బాగా తిరుగుతున్నారు" అని అజిత్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. అయితే చేసిన ప్రసంగమంతా ఒక పక్కకు పోయి "ఎద్దు, దూడ, ఆవు" అన్న వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు జనం లో పాపులర్ అయ్యాయి.