రాహుల్ ముద్దు పెట్టిన మహిళ :మరీ అలాంటి ట్రోల్ సరి కాదేమో

22:22 - February 14, 2019

 

 

 

 

 

 

 

రాహుల్ గాంధీ ఇప్పటికీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ గానే చలామనీ అవుతున్నాడు. 2014 ఫిబ్రవరిలో బోంటీ అనే మహిళ రాహుల్ కి ముద్దు పెట్టి తర్వాత టీవీ చానెళ్ళలో రావటంతో ఆమెని చంపి భర్త ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు మరో మహిళ రాహుల్ గాంధీ కి ముద్దు పెట్టి వార్తల్లోకెక్కింది. 


అవును మీరు చదువుతున్నది నిజమే  వాలెంటైన్స్ డే నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ మహిళ ముద్దు పెట్టింది. గుజరాత్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ఈ ఘటన జరిగింది. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ స్టేజ్‌పై ఉండగా. ఓ మహిళ అక్కడికి వచ్చింది. ఆమెతోపాటు మరికొంత మంది రావడంతో రాహుల్ లేచి నిల్చున్నారు. సడెన్‌గా ఓ మహిళ రాహుల్ చెంపపై ముద్దు పెట్టింది. దీంతో ఆయన చిరునవ్వులు చిందించారు. అయితే ఇక్కడ ముద్దు పెట్టిన మహిళ రాహుళ్ ని ఆతర్వాత గడ్డం పట్టుకొని మరీ ముద్దు చేయటం చూస్తే మాత్రం ఆమె రాహుల్ ని ఒక పిల్లవాడిగా మాత్రమే చూసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పటి ఇంద్రా గాధీ మనవడిగా ఇప్పటికీ రాహుల్ ని ముద్దు చేసే పిల్లవాడిగానే చూస్తున్నారు ఈమె కూడా అదే భావంతో ముద్దు పెట్టి ఉండవచ్చు. కానీ కొన్ని ట్రోల్స్ మాత్రం మరీ ఎబ్బెట్టుగా ఉన్నాయి. 

మిగతా మహిళలు రాహుల్‌కు భారీ హారం వేస్తున్న సమయంలో ఆ మహిళ మాత్రం ఆయనను చూస్తూ మురిసిపోతున్నట్లు వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ కిస్‌ను వాలెంటైన్స్ డే కు ముడిపెట్టి మరీ ట్రోల్ చేయటానికి వాడుకుంటూ షేర్ చేస్తున్నారు.  

video: The Quint