శరీరానికి రాళ్ళు కట్టి...., నటి దారుణహత్య

11:48 - March 30, 2019

*చత్తీస్ ఘడ్ లో  నటి ,మోడల్ దారుణ హత్య 

*మృతదేహానికి రాళ్ళు కట్టి చెరువులో వదిలిన హంతకులు  

*టాటూ ఆధారంగా గుర్తించిన పోలీసులు 

 

చత్తీస్ ఘడ్ మరో దారుణంతో వార్తల్లోకెక్కింది. ఆంచల్ యాదవ్ అనే నటి, మోడల్  దారుణంగా హత్య చేయబడింది. అంతే కాదు ఆమె మృతదేహానికి రాళ్ళు కట్టి మరీ చెరువులో పడేయటంతో అసలు గుర్తుపట్టలేని స్తితిలో ఆమె మృతదేహం బయట పడింది.  ఆమె శరీరం పై కత్తిపోట్లని కూడా గుర్తించారు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన జార్ఖండ్‌లోని ధంతేరి జిల్లాలో వెలుగుచూసింది. జార్ఖండ్‌లోని రాంచీలో ఉంటూ మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది 32 ఏళ్ల ఆంచల్ యాదవ్. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే ఆంచల్‌కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ధంతేరి జిల్లాలోని బాలోద్ గ్రామంలోని ఓ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటికి వచ్చింది. ముఖం గుర్తు తెలియనంతగా పాడైపోవడంతో శరీరం మీద ఉన్న టాటూను ఫోటో తీసి... సోషల్ మీడియాలో ప్రచారం చేశారు పోలీసులు. ఆ టాటూను గుర్తుపట్టిన ఆంచల్ యాదవ్ స్నేహితులు, ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పారు.

 దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేశారు. హత్యకు ముందుకు ఆమె ఎవరెవరితో మాట్లాడింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. మృతదేహం దొరికిన చోట ఆమె ఫోన్ లభ్యం కాకపోవడంతో వేరేచోట హత్యచేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు అనుమానిస్తున్నారు. 

 2014లో ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌ను బెదిరించి డబ్బులు వసూలుచేసిన కేసులో ఆంచల్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో సన్నిహితంగా ఉన్న వీడియోను బయటపెడతానని బెదిరించి ఆఫీసర్ వద్ద ఆమె పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నట్లు కేసు నమోదైంది. అయితే ఫారెస్ట్ ఆఫీసర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడని ఆమె ఆరోపించింది. ఇన్స్యూరెన్స్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్న సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్‌ను కలిసానని, అప్పుడు పాలసీ తీసుకోవాలంటే తనతో సెక్స్ చేయాలని అధికారి తనపై లైంగికదాడి చేశాడని సంచలన ఆరోపణలు చేసింది ఆంచల్ యాదవ్. ఈ వివాదం ఇంకా కోర్టులో నడుస్తున్న సమయంలో ఆమె హత్యకు గురైంది. 
హత్య మాత్రమేనా అత్యాచారం చేసి చంపేశారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆంచల్‌ యాదవ్‌కు బాగా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తే, ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంచల్ యాదవ్ సోషల్ మీడియా అకౌంట్స్, కాల్ డేటా ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.