ఆ వార్త అబద్దం, నేను ఇంట్లోనే ఉన్నా: మోహన్ బాబు

15:02 - April 2, 2019

*తప్పుడు వార్తలు విని..నిరాశకు లోనయ్యా

*ఆ వార్తలు నిజం కాదు. నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లో ఉన్నా

*కొన్ని టీవీ చానళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం: మోహన్ బాబు

 

 

 

చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధించినట్టు వార్తలు వచ్చిన  సంగతి తెలిసిందే. దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి ఈ కేసును వేశారు. మోహన్ బాబుకు జైలు శిక్ష పడిందనే వార్త సంచలనం రేపుతోంది. మరోవైపు దీనిపై మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా ఆయన స్పష్టత ఇచ్చారు. చెక్ బౌన్స్ కేసులో నాకు శిక్ష పడినట్లు పలు టీవీ ఛానళ్లలో తప్పుడు వార్తలు విని..నిరాశకు లోనయ్యా. ఆ వార్తలు నిజం కాదు. నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లో ఉన్నా అని ట్వీట్ చేశారు. 'కొన్ని టీవీ చానళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఇప్పుడే విన్నా. నేను నా ఇంట్లోనే ఉన్నా' అంటూ ట్వీట్ చేశారు.

                                                          
మంచు విష్ణు హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో డిజాస్ట‌ర్ అయింది. ఈ చిత్రం విష‌యంలో వైవీఎస్ చౌదరి, మోహన్ బాబు మధ్య విబేధాలు వచ్చాయి. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ సంస్థ‌లో ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాడు మోహ‌న్ బాబు. అయితే సినిమా దారుణంగా నిరాశ ప‌రిచింది. న‌ష్టాలు కూడా భారీగా రావ‌డంతో అక్క‌డే డబ్బు విషయంలో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు కూడా వ‌చ్చాయి. దాంతో అక్క‌డ్నుంచి ఈ కేస్ న‌డుస్తుంది 

                                                      


 చెక్ బౌన్స్ కేస్ పెట్టింది ఎవ‌రో కాదు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రి. ఆయ‌న‌తో అప్ప‌ట్లో స‌లీమ్ సినిమా చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. 2010లో దర్శకుడు వైవీఎస్ చౌదరి మోహన్ బాబుపై చెక్ బౌన్స్ కేసును వేశాడు. ఈ కేసులో ఏ 1 లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నాడు. 2010 లో రూ. 48 లక్షలు చెక్ ఇస్తే అది బౌన్సు అయ్యిందని నిర్మాత వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. 

                                                      

ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్‌, ఏ2గా మంచు మోహన్‌బాబుగా కోర్టు తేల్చింది.2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై నమోదైన ఈ కేసులో బాధితుడికి కోర్టు ఆదేశాల మేరకు జరిమానాగా రూ.41.75 లక్షలు చెల్లించకపోతే మరో మూడు మాసాల పాటు జైలు శిక్షను పొడిగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.మంగళవారం నాడు ఈ కేసు విషయమై ఎర్రమంజిల్ 23 కోర్టు జడ్డిజ వి. రఘునాథరావు తీర్పు వెలువరించారు. అయితే ఇదంతా నిజం కాదని తాను ఇంట్లోనే ఉన్నానని మోహన్ బాబు పెట్టిన ట్వీట్ ఆశ్చర్యంగానే ఉంది మరి...