మూడేళ్ళుగా నరకం చూపించారు: 16 ఏళ్ల బాలికపై 11 మంది కీచకుల అత్యాచారం   

12:46 - January 14, 2019

 

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో  రెండేళ్లుగా 16 ఏళ్ల బాలికపై 11 మంది కీచకులు  మూడేళ్ళుగా గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఆ బాలిక సమీప బంధువేనని తెలుస్తోంది. సొంత మన్షే ఇంతటిదారుణానికి పాల్పడతాడని ఆ కుటుంబసభ్యిలెవరూ ఊహించి కూడా ఉండరు. 

 ఓ ఆయిల్‌ వ్యాపారి తన కుటుంబంతో కలిసి కామాటిపుర ఏరియాలో ఉంటున్నాడు. రెండేళ్లక్రితం ఓరోజు కుటుంబసభ్యులు పనికి వెళ్లిన తర్వాత బాలిక ఒంటరిగా ఉండడం చూసి సమీప బంధువైన రాజేశ్‌ (25) ఇంట్లోకి వచ్చాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించాడు. దాన్ని చూపిస్తూ.. పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.

కొన్నాళ్లకు ఆ వీడియోను స్నేహితులు అభిజిత్‌ కౌశిక్‌, శుభమ్‌ వ్యాస్‌లకు షేర్‌ చేశాడు. తర్వాత ఆ వీడియో షేరవుతూ 10మందికి చేరింది. వీడియోను బయటపెడతామని బెదిరిస్తూ రాజేశ్‌, అబిజిత్‌, శుభమ్‌తో పాటు మిగతా 8మంది బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు డిసెంబరు 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిసెంబరు 31న రాజేశ్‌, అభిజిత్‌, శుభమ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.కేసుకు సంబంధించి విజయ్‌కుమార్‌ను పోలీసులు సాక్షిగా చేర్చారు. 


దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆదివారం బస్తీలో, కామాటిపురా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. మిగతావారినీ అరెస్ట్‌ చేసి, ఉరితీయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దక్షిణ మండలం అడిషనల్‌ డీసీపీ మహ్మద్‌ రఫీక్‌, మీర్‌చౌక్‌ ఏసీపీబి ఆనంద్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత బాలిక వాంగూల్మనం నమోదు చేశారు. సాక్షిగా ఉన్న విజయ్‌ కుమార్‌ కూడా తనపై అత్యాచారం జరిపినట్లు బాలిక చెప్పడంతో కేసును సీసీఎ్‌సకు బదిలీ చేసినట్లు సీపీ చెప్పారు