న్యాయం ఎక్కడుంది? ఇది సబబేనా?: విజయ్ మాల్యా

13:44 - February 2, 2019

ఆర్థిక నేరగాళ్ల కోసం కొత్త చట్టాన్ని ప్రభుత్వం గతేడాది ఆగష్టులో తీసుకొచ్చింది. ముంబైలోని ప్రత్యేక కోర్టులో విజయ్ మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని ఆయన కేసులను విచారణ చేస్తున్న ఈడీ అప్లికేషన్ దాఖలు చేసింది. కేసును విచారణ చేసిన ప్రత్యేక కోర్టు ఈడీ పెట్టిన అప్లికేషన్‌కు అనుకూలంగా విజయ్ మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం తొలి ఆర్తిక నేరస్తుడిగా విజయ్ మాల్యా నిలిచాడు

విజయ్ మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన బ్యాంకుల కన్సార్టియం తరఫున అప్పు రికవరీ ట్రిబ్యునల్ కు చెందిన అధికారులు మాల్యా ఆస్తులను జప్తు చేశారు. ఈ నేపథ్యంలో కింగ్ ఫిషర్ అధినేత ట్విట్టర్ ద్వారా తన ఆవేదన - అసహనం వెల్లగక్కాడు. తన ఆస్తులను జప్తు చేయడం అన్యాయని వాపోయాడు. తనకు సంబంధించిన దాదాపు 13వేల కోట్ల ఆస్తులను దర్యాప్తు సంస్థలు జప్తు చేశాయని,తాను చెల్లించాల్సిన రుణాలు 9వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నాడు.  

ఇంకా ఇది ఎంత దూరం వెళ్తుంది? ఇది న్యాయమేనా?  భారత్ లోని అప్పులు సెటిల్ చేసేందుకు బ్యాంకులు ఇంగ్లండ్ లోని నా డబ్బు కావాలనుకుంటున్నాయి అని మండిపడుతూ పలు ట్వీట్లలో కీలక కామెంట్లు చేశారు. బ్యాంకుల కన్సార్టియం తరఫున రూ. 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన నా కంపెనీ గ్రూపు ఆస్తులను డీఆర్టీ రికవరీ అధికరులు ఇటీవలే స్వాధీనం చేసుకున్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులను రూ.9,000 కోట్లు నేను నష్టపరచినట్లు నాపై అభియోగం మోపారు. ఇందులో న్యాయం ఎక్కడుంది? ఇది సబబేనా?’  అంటూ తన ట్వీట్లని మొదలు పెట్టిన మాల్యా .

తన మరో ఆస్తిని డీఆర్టీ రికవరీ అధికారి స్వాధీనం చేసుకున్నారన్న వార్తతో తనకు తెల్లారుతున్నదని, స్వాధీనం చేసుకున్న నా ఆస్తుల విలువ రూ.13,000 కోట్లు ఇప్పటికే దాటిపోయిందని,వడ్డీలన్నీ కలుపుకుని తాను బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయి రూ.9,000 కోట్లని చెబుతున్నాయని గుర్తు చేశారు.  

‘ఇంకా ఎన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు..దీని అంతు ఎక్కడ? ఇది న్యాయమేనా?’ అంటూ ఆయన మరో ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.భారతదేశంలో అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నా తనపైన లెక్కలేనన్న పిటిపిషన్లు వేయడానికి ఇండియన్ బ్యాంకులు ఇంగ్లండ్‌లోని తమ న్యాయవాదులకు అనుమతులు మంజూరు చేశాయమని, ఇంత దారుణంగా ప్రభుత్వ సొమ్మును లీగల్ ఫీజుల కింద ఖర్చు చేస్తుంటే ఎవరు జవాబుదారీ? అయినా ప్రభుత్వ రంగ బ్యాంకులకు నేను రూ.9,000 కోట్లు ఎగవేసి పారిపోయానని చెబుతున్నారు. న్యాయం ఎక్కడుంది? ఇది సరైన చర్యేనా?’ అంటూ వరుస ట్వీట్లతో ప్రశ్నలు వేస్తూపోయారు.  

తన నుంచి రుణాల వసూలు పేరుతో భారతీయ బ్యాంకులు లాయర్ల ఖర్చుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్నీ మాల్యా తప్పు పట్టారు. ఇందుకు ఎవరు జవాబుదారీ?అని ప్రశ్నించారు. ఇవే బ్యాంకుల లాయర్లు, బ్రిటన్‌లో తన లాయర్ల కోసం ఖర్చు చేస్తున్న ఫీజులను ప్రశ్నించడాన్నీ మాల్యా తప్పు పట్టారు. 

కాగా కొద్దికాలం క్రితం మాల్యా న్యాయవాది  మాల్యా రహస్యంగా దేశం వీడిపోయారన్నదానిలో ఎంతమాత్రం నిజం లేదు అంటూ ఆసక్తికర ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ఖరారైన ఓ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకే వెళ్లారని అన్నారు. 2016 - మార్చి 2న విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోలేదని స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరుగుతున్న వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారని హాజరయ్యేందుకు వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది ఈడీ కోర్టుకు తెలిపారు. అయితే 300 బ్యాగులతో - భారీ కార్గోతో ఓ సమావేశానికి ఎవరైనా వెళ్తారా అని ఈడీ న్యాయవాది ప్రశ్నించారు, వరుసగా విజయ్ మాల్యా ఆస్తులని జప్తు చేస్తూ వస్తున్నారు. దీనిపైనే తాజాగా మాల్యా అసహనం వ్యక్తం చేశారు.