'నోటా' ట్రైలర్ వచ్చేస్తోంది..

19:10 - September 3, 2018

 

 

యూత్ లో విపరీతమైన క్రేజ్ వున్న యువ కథానాయకులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఇటీవల తమిళంలో విడుదలైన ఆయన సినిమాల కారణంగా అక్కడ కూడా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఆయన హీరోగా 'నోటా' అనే వైవిధ్యభరితమైన కథాంశంతో సినిమా రూపొందుతోంది. ఆనంద్ శంకర్ దర్శకుడిగా .. తెలుగు - తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోంది.

జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మెహ్రీన్ .. సంచన నటరాజన్ నటిస్తున్నారు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాను అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ ను వదలనున్నారు. ట్రైలర్ తోనే అంచనాలు అమాంతంగా పెరిగేలా దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.