వంద కోట్ల క్లబ్ లో "గీత గోవిందం"

11:22 - August 28, 2018

వరుస విజయాలతో జోరు మీద ఉన్న విజయ్.. పెళ్లిచూపులు, ద్వారకా, అర్జునరెడ్డి, ఏమంత్రం వేసావే... సినిమాలతో తనకంటూ ఒక స్టార్డామ్ ను తెచ్చుకున్నాడు...
అర్జున్ రెడ్డి సినిమాతో  ట్రెండ్ సెట్ చేశాడు..
  
 విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటించిన 'గీత గోవిందం' ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. విడుదలైన ప్రతి చోటున విజయవిహారం చేస్తోంది. తొలి అయిదు రొజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఆ తరువాత ఈ సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టొచ్చుననీ, 100 కోట్ల వరకూ వెళ్లకపోవచ్చుననే ప్రచారం జరిగింది.

కానీ వాళ్ల అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఇంతవరకూ 16 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ వారం విడుదలవుతోన్న 'నర్తనశాల' .. 'పేపర్ బాయ్' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ప్రభావితం చేయలేకపోతే, 'గీతగోవిందం' 125 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరి ఈసినిమా ఇంకా ఎన్ని వసూళ్లను సాధించనుందో వేచి చూడాల్సిందే..