మిర్చీ భామ పెళ్లి: క్లాసం మేట్ తోనే వివాహం

14:59 - January 17, 2019

షెఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన రానా దెబ్యూ సినిమా "లీడర్" చిత్రంతో తెలుగు తెరకు పరిచమైన రిచా గంగోపాధ్యాయ్ , మొదటి సినిమా ప్లాప్ అయినా కానీ అమ్మడికి వరుస ఆఫర్స్ వచ్చి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. మిరపకాయ్ , మిర్చి లాంటి సూపర్ హిట్స్ తో యూత్ లో బాగా క్రేజ్ తెచ్చుకుంది.

కేవలం తెలుగులోనే కాదు తమిళం లో కూడా ధనుష్ , శింబు వంటి స్టార్ హీరోస్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. యూఎస్ లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏ మేనేజ్ మెంట్ కోర్సు చేసేందుకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రిచా తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. తన క్లాస్ మేట్ జోయ్ తో నిశ్చితార్థం పూర్తయినట్లు రిచా గంగోపాధ్యాయ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. 


తాజాగా ఆమె ప్రియుడు జోయ్ లంగేల్లతో అమెరికాలో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్త జోయ్ కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. రిచా యుఎస్‌లో బిజెనెస్ స్కూల్‌లో చదువుతున్న సమయంలో జోయ్‌తో ఏర్పాడ్డ పరిచయం ప్రేమగా మారింది. ‘నాకు నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భాన్ని మీతో పంచుకుంటున్నాను.

జోయ్‌‌ను బిజినెస్‌ స్కూల్‌లో కలుసుకున్నాను. అక్కడ ఉన్న రెండు ఏళ్ళు చాలా ఆనందంగా గడిచాయి. నా జీవితంలో ముందు జరగబోయే మరిన్ని అద్భుతమైన క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను ఇంకా పెళ్లి తేదీ ఖరారు కాలేదు’ అని జోయ్‌తో దిగిన పోటోను జత చేస్తూ పోస్ట్‌ పేట్టారు. దీంతో పలువురు సెలబ్రెటీలు,నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.