టాలీవుడ్‌లో పండుగ వాతావర‌ణం...

18:10 - August 22, 2018

మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా టాలీవుడ్‌లో పండుగ వాతావర‌ణం నెల‌కొంది. మెగా ఫ్యాన్స్ కూడా చిరు బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో భారీగా పాల్గొంటున్నారు. తాజాగా విడుద‌లైన `సైరా` టీజ‌ర్ కూడా అభిమానుల‌కు మ‌రింత ఆనందాన్ని క‌లుగ‌జేస్తోంది. సినీ నటులు రాజకీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా చిరంజీవికి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు.

    వరుస సినిమాలతో దూసుకెళుతున్న హీరో విజయ్ దేవరకొండ మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలిపాడు. 'మన మెగాస్టార్ కు వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే. మాలాంటి ఎంతో మంది సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి మీరే. మా రోల్ మోడల్ మీరే. థాంక్యూ అన్నా' అంటూ ట్వీట్ చేశాడు.
 
     నారా లోకేష్: చిరంజీవికి ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు. రానున్న రోజుల్లో మీరు మరింత ఆరోగ్యంగా, మరింత సక్సెస్ ఫుల్ గా ఉండాలి. మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు.

హరీష్ శంకర్ : బర్త్‌డే మెగాస్టార్‌. చిత్రపరిశ్రమకు మీరు అందిస్తున్న మంచి సినిమాలకు, మాలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తూ, మాకూ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా చేస్తున్నందుకు గానూ ధన్యవాదాలు. లవ్యూ సర్‌..

వంశీ పైడిపల్లి: మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రయాణం మాకెంతో స్ఫూర్తిదాయకం. 

కొరటాల శివ: మా మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే అందరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి...