విడుదలైన టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌...

13:34 - January 29, 2019

ఆస్ట్రేలియాలో 2020లో నిర్వహించే పురుషుల, మహిళల ప్రపంచ కప్‌ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. తొలిసారిగా మహిళల, పురుషుల టీ20 ప్రపంచ కప్‌లను ఒకే ఏడాది, ఒకే దేశంలో నిర్వహిస్తున్నారు. ఈ రెండు టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌లను మెల్‌బోర్న్‌ స్టేడియంలోనే నిర్వహించనుండటం విశేషం. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ జట్లు ఉన్న కఠినమైన గ్రూప్‌ 2లో కోహ్లీ సేనను చేర్చారు. ఈ గ్రూప్‌లో ఆ మూడు జట్లతోపాటు మరో రెండు అర్హత సాధించే జట్లు ఉండనున్నాయి. దక్షిణాఫ్రికాతో టీమిండియా తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. మరో వైపు భారత మహిళల జట్టును గ్రూప్‌ ఏలో చేర్చారు. తొలి మ్యాచ్‌లోనే భారత్‌ కఠిన జట్టును ఎదుర్కోనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. మహిళల ప్రపంచ కప్‌లో మొత్తం పది జట్లు 23 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ తలపడనున్నాయి. ఇక పురుషుల ప్రపంచకప్‌ అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరగనుంది.

మహిళల ప్రపంచ కప్‌ షెడ్యూల్‌:

గ్రూప్‌ మ్యాచ్‌లు : ఫిబ్రవరి 21-మార్చి 3
గ్రూప్‌ ఏ :ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్‌, శ్రీలంక, క్వాలిఫయర్‌ 1
గ్రూప్‌ బి :ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, క్వాలిఫయర్‌ 2
సెమీఫైనల్స్‌: మార్చి 5
ఫైనల్‌: మార్చి 8

పురుషుల ప్రపంచ కప్‌ షెడ్యూల్‌:

క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు : అక్టోబర్‌ 18 నుంచి 23 వరకు

గ్రూప్‌ మ్యాచ్‌లు :అక్టోబర్‌ 24-నవంబర్‌ 8
గ్రూప్‌ 1 : పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, రెండు అర్హత సాధించిన జట్లు.
గ్రూప్‌ 2 : భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గనిస్థాన్‌, రెండు అర్హత సాధించిన జట్లు.

సెమీ ఫైనల్స్‌ : నవంబర్‌ 11, 12