బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్న నాలుగు సినిమాలు..

13:02 - August 23, 2018

బాక్సాఫీస్ ముందు ఒకేసారి 4చిత్రాలు పోటీపడతున్నాయి.. వీటిలో ఏచిత్రం ప్రేక్షకులను అలరించనుందో  చూడాలి..

ఈ ఏడాది టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. భరత్ అనే నేను, రంగస్థలం, మహానటి వంటి చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఎలాంటి హడావుడి లేకుండా రిలీజైన చిన్న సినిమాలు కూడా  అలరించాయి. ఇటీవల విడుదలైన గూఢచారి, ఆర్ఎక్స్ 100, చిలసౌ, గీతగోవిందం చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. మరోవైపు, రేపు (శుక్రవారం) మరో నాలుగు సినిమాలు బాక్సీఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. నీవెవరో, ఆటగాళ్లు, అంతకుమించి, లక్ష్మీ చిత్రాలు రేపు విడుదల కబోతున్నాయి.

 

'ఆటగాళ్లు' చిత్రంలో నారా రోహిత్, జగపతిబాబులు ప్రధాన పాత్రలను పోషించారు.

'నీవెవరో' సినిమాలో ఆది పినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ లు జంటగా నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండగా... ప్రభుదేవా నటించిన 'లక్ష్మీ' చిత్రంపై కూడా ఆసక్తి నెలకొంది. 'అంతకుమించి' చిత్రంలో రష్మి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్  ఆకట్టుకుంది.