కొడవలి పట్టి, పంట కోసి: ఎన్నికల వేళ డ్రీమ్‌ గర్ల్‌ కి ఎన్ని కష్టాలో

15:54 - April 1, 2019

ఒకప్పటి  బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌, మధుర నియోజవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమమాలిని సినిమాటిక్ స్టైల్లో ప్రచారం చేస్తున్నారు.. ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ పడుతున్న హేమమాలిని తన ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. గోవర్థన క్షేత్ర ప్రాంతానికి వచ్చిన ఆమె గోధుమ పోలాల్లో తిరిగారు. అంతే కాదు కొడవలి పట్టి కొంత పంటని కోసి మరీ చూపించారు.  

ఆదివారం నుంచి ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను టార్గెట్ చేశారు. గోవర్థన క్షేత్ర ప్రాంతానికి వచ్చిన ఆమె గోధుమ పోలాల్లో తిరిగారు. అనంతరం గోధుమ పంట పనలను..కొడవలిని చేతుల్లోకి తీసుకున్నారు. తరువాత పొల్లాల్లో ఉన్న మహిళలతో ముచ్చటించారు.వారి సమస్యలు తెలుసుకున్నారు. 

                                                                              


ఈ సందర్భంగా హేమా మాలినీ మాట్లాడుతూ.. నా నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది. ప్రజలు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మథుర నియోజవర్గానికి చేసిన మేలు కారణంగానే ప్రజలు నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను చేసిన పనికి ఎంతో గర్వపడుతున్నాను. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాను. గతంలో మథుర నియోజవర్గానికి నేను చేసినంతంగా ఎవరూ చేయలేదు’ అని చెప్పారు.

                                                               


2004లో బీజేపీలో చేరిన హేమమాలిని, 2014లో రాష్ట్రీయ లోక్ దల్ అభ్యర్థి జయంతో చౌదరిపై విజయం సాధించారు. కాగా మధురలో మరోసారి పోటీ చేసి గెలవాలనే ఉత్సాహంలో ఉన్నారు హేమమాలిని. ఫిబ్రవరి 18న ఎలక్షన్ జరగనున్న క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గోధుమ పంట పనలను పట్టుకుని ఓట్లు వేయాలని కోరారు.  హేమామాలినీ స్థానిక మహిళా రైతులతో కలిసి గోధుమ‌పైరును కోత కోస్తున్న ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్ లో మథుర నియోజకవర్గానికి హేమామాలినీ ప్రాతినిథ్య వహిస్తుండగా.. విపక్షాలు ఆమెను ఔట్ సైడర్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

                                                           

ఇదిలా ఉంటే హేమమాలిని తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఆమెకు ప్రజా సమస్యలు వినేందుకు సమయం దొరకడంలేదని అంటున్నారు. తమ కష్టాలు చెప్పుకునేందుకు గెస్ట్‌హౌస్‌ దగ్గరకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించినా.. హేమామాలిని బయటకు రాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు