సోడా కావాలా? వాటర్ కావాలా?

11:16 - August 25, 2018

 

 

 

 

 

 

 

అక్కినేని నాగార్జున,నాక్చరల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’ ఇటివలే టీజర్ విడుదలైంది. నాగార్జున, నాని ఇద్దరుకలిసి మద్యం సేవించేందుకు కూర్చున్న సన్నివేశం ఈ టీజర్ లో కనబడుతుంది. నానిని ‘సోడా కావాలా? వాటర్ కావాలా?’ అని నాగ్ అడిగే లోపే, నాని తన మద్యం గ్లాస్ ను ఖాళీ చేయడం నవ్వు తెప్పిస్తుంది.

‘దాసూ.. ఏంటీ సంగతి?’ అని నాగార్జున ప్రశ్నించడం..‘ఆ..’ అంటూ నానీ మూతి తుడుచుకునే సన్నివేశం తమాషాగా ఉంది. కాగా, ముందే ‘స్మాల్ పెగ్ టుమారో @ 5 పీఎం’ అంటూ నిన్న చిత్రయూనిట్ ట్వీట్ చేయడం తెలిసిందే. అలా చెప్పినట్టుగానే, నాగ్, నానీలు పెగ్ వేసేందుకు కూర్చుని ఉండటం టీజర్ లో కనిపిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండుగా చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు జరుగుతున్నాయి... ఈ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి... మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించనుందో చూడాలి..