అల్లు శిరీష్ మూవీలో 'జబర్దస్త్' బేబీ

13:45 - September 3, 2018

అల్లు శిరీష్ కథానాయకుడిగా 'ఏబీసీడీ' సినిమా రూపొందుతోంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన 'ఏబీసీడీ' సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంతో, అల్లు శిరీష్ కథానాయకుడిగా తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.ఈ సినిమాలో బేబీ 'దీవెన' కూడా నటిస్తోంది. 'జబర్దస్త్' కామెడీ షో చూసేవారికి బేబీ దీవెన గురించి చెప్పవలసిన పనిలేదు. ముద్దు ముద్దు మాటలతో నవ్వించే ఈ చిన్నారికి చాలామంది అభిమానులు వున్నారు. అలాంటి దీవెన .. తన ఫేవరేట్ అంటూ .. ఆమెతో దిగిన ఒక ఫోటోను శిరీష్ పోస్ట్ చేశాడు. ఇప్పటివరకూ బుల్లితెరపై సందడి చేస్తూ వస్తోన్న బేబీ దీవెన, ఈ సినిమా తరువాత మరిన్ని అవకాశాలతో వెండితెరపై కూడా బిజీ కావడం ఖాయమనిపిస్తోంది.