కొత్త రికార్డును సృష్టించిన కోకో..

15:56 - August 27, 2018

అందాలభామ నాయన మంచి రికార్డుని సొంతం చేసుకుంది..తమిళనాట నయనతారకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 
విభిన్నమైన కథా చిత్రాలు ..
వరుస విజయాలు ఆమె క్రేజ్ ను మరింతగా పెంచుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజా చిత్రంగా 'కొలమావు కోకిల' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 17వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. 9 రోజుల్లో ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా సౌత్ లో ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే మొదటి సారి. ఈ అరుదైన రికార్డును నయనతార సొంతం చేసుకోవడం పట్ల ఆమె అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. తెలుగులో ఈ సినిమాను 'కోకో కోకిల'అనే పేరుతో ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులోను ఈ సినిమా ఆమెకి భారీ విజయాన్ని కట్టబెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.