అప్పుడు కూడా లైంగిక వేధింపులు ఉన్నాయి...

16:29 - August 27, 2018

ఒకప్పటి అందాలతార మీనా కాస్టింగ్ కౌచ్ పై  స్పందించింది.. తాను చాల సినిమాల్లో చేశాను..
    పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక విచారకరమైన అంశమని నటి మీనా తెలిపింది. తమ కాలంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయని...
      అయితే, తనకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది. వక్ర బుద్ధి కలిగిన మగాళ్లు ఇకనైనా మారాలని తెలిపింది. ఒక స్త్రీతో డీల్ చేసేముందు తమకు కూడా భార్య, పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించింది.
తన కెరీర్ లో తాను అగ్ర నటులందరితో నటించానని....
    అరవిందస్వామితో మాత్రం నటించలేకపోయానని మీనా తెలిపింది. ఆయనతో నటించే అవకాశం వచ్చినా, కాల్షీట్స్ సమస్య కారణంగా అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది. విజయ్ తో చాలా చిత్రాలు కమిట్ అయి కూడా నటించలేకపోయానని తెలిపింది. విజయ్ తో నటించలేక పోయాననే కొరతను తీర్చుకోవడానికే 'షాజహాన్' చిత్రంలో ఆయనతో కలసి ఓ పాటలో నటించానని చెప్పింది.