96కి మరో ప్రత్యేకత...

13:01 - March 18, 2019

ప్రముఖ నటులు గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి దివంగత శ్రీనివాస్ పేరు మీద ఏటా అవార్డులు ఇచ్చే సంగతి తెలిసిందే. ఈ అవార్డు అధిక శాతం తెలుగు సినిమా వాళ్ళకే ఇస్తారు. తాజాగా తమిళ్ లో గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన 96 దర్శకుడు ప్రేమ్ కుమార్ కు ఈ పురస్కారం దక్కింది. అందులో వింతేముంది అనకోకండీ...ఉత్తమ విలువ కలిగిన చిత్రాలకు మాత్రమే ఈ పురస్కారం దక్కుతుందన్న గౌరవం దీని మీద పరిశ్రమలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు 2002లో కుట్టి అనే తమిళ్ మూవీకి గాను జానకి విశ్వనాథన్ కు ఇది దక్కింది. ఆ తర్వాత ఇప్పటి దాకా వేరే ఏ కోలీవుడ్ డైరెక్టర్ ఇది అందుకోలేదు ఆ రకంగా 96 మరో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు శర్వానంద్ సమంతా జంటగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయట.