' 96 ' మూవీ రిమెక్‌పై సమంత వ్యాఖ్యలకు స్పందించిన దిల్‌రాజు...

15:35 - January 31, 2019

త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లై క్లాసిక్ హిట్‌గా నిలిచింది ' 96 ' సినిమా. ఈ సినిమా గురించి గ‌తంలో హీరోయిన్ స‌మంత స్పందిస్తూ... '' 96 '  సినిమా ఓ క్లాసిక్‌. దాన్ని ఎవ‌రూ రీమేక్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది ' అని వ్యాఖ్యానించింది. అయితే అనుకోకుండా ఆ సినిమాలో హీరోయిన్‌గా స‌మంతే ఎంపికైంది. విజ‌య్ సేతుప‌తి, త్రిష జంటగా న‌టించిన ఈ సినిమాను తెలుగులోకి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌మంత వ్యాఖ్య గురించి తాజాగా దిల్ రాజు స్పందించారు. ఈ సినిమాను నేను విడుద‌ల‌కు ముందే చూశా. తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అవుతుంద‌నిపించింది. వేంట‌నే రీమేక్ హ‌క్కులు తీసుకున్నా. త‌గిన న‌టీనటులు దొరికితే తెలుగులో కూడా నేనే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాన‌ని త‌మిళ డైరెక్ట‌ర్ చెప్పారు. వెంట‌నే నేను స‌మంతను సంప్ర‌దించా. అప్ప‌టికే  ' 96 ' గురించి మీడియాలో వార్త‌లు వ‌చ్చేశాయి. ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి. దాంతో స‌మంత అలా స్పందించి ఉంటుంది. ఈ టీమ్‌లో ఎవ‌రెవ‌రున్నారో తెలియ‌క అలా మాట్లాడేసింది. ఇన్నేళ్ల కెరీర్‌లో నేను చేస్తున్న తొలి రీమేక్ ఇది అని దిల్ రాజ్ చెప్పారు.