30 ప్రాణాలు బలిగొన్న బంగారం: ఈ ధారుణం ఎక్కడంటే...

05:01 - January 7, 2019

 గనులు మానవ సమాజాన్ని ఎంతగా అభివృద్దిలోకి తెచ్చాయో అంతగా శ్రమదోపిడీకి ప్రధాన వేదికగా మారాయి. గనుల్లో సంపద మనిషుల ప్రాణాలనూ బలితీసుకుంటుంది. మనదేశంలో బొగ్గు గనుల ఘటనలని చూస్తూనే ఉన్నాం. అదే తరహా ప్రమాదం ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ లో చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో విషాదం చోటుచేసుకుంది. బంగారపు గనుల్లో గ్రామస్తులు 200 అడుగుల లోతులో తవ్వుతుండగా చుట్టూ ఉన్న గోడలు కూలి వారి మీద పడ్డాయి. దీంతో ఊపిరాడకపోవడంతో 30 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 15మంది గాయాలతో బయటపడ్డారు. 


     అయితే గోడలు కూలడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఇప్పటి వరకూ అందిన వివరాల ప్రకారం. ఆప్ఘనిస్తాన్‌లోని కొహిస్తాన్ జిల్లా బదక్షన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. తవ్వకాలు జరిపిన వ్యక్తులు అనుభవం లేనివారు అయ్యుండొచ్చని. అందుకే గోడలు కూలి ఉంటాయని ప్రావిన్స్ గవర్నర్ నిక్ మహ్మద్ నజరి తెలిపారు.

ఈ గ్రామస్తులు కొన్ని దశాబ్దాలుగా ఇలా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని. వీరిపై ప్రభుత్వ నియంత్రణ లేదని ఆయన చెప్పారు. ఘటనా స్థలికి రెస్క్యూ టీంను పంపామని. అప్పటికే గ్రామస్తులు మృతదేహాలను బయటకు తీశారని ఆయన వెల్లడించారు. ఆప్ఘనిస్తాన్‌లో ఇలా అక్రమంగా బంగారం కోసం తవ్వకాలు జరపడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయి. అయితే ఈసారి ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.