మళ్ళీ రగులుకున్న శబరిమల వివాదం: మరొ ఇద్దరు మహిళలు... 

11:52 - January 16, 2019

శబరిమల వివాదం మళ్ళీ మళ్ళీ రాజుకుంటూనే ఉంది తాజాగా మరికొంత మంది మహిళలు ఆలయం లోకి ప్రవేసించే ప్రయత్నం చేసారు. అయితే ఆందోళన కారులు వీరిని అడ్డుకోవటంతో మళ్ళీ శబరిమల ఉద్రిక్తంగా మారింది. 10 నుంచి 50 ఏళ్ల వయస్సున్న బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు గత సెప్టెంబర్ 28న తీర్పు చెప్పింది. దాంతో అప్పటి నుంచి అనేక మంది మహిళలు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు విఫలయత్నం చేశారు.

    జనవరి 2న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు మాత్రం పోలీసుల రక్షణతో ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. అయితే ఈ ఘటన కేరళాను అట్టుడికించింది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికి ఆందోళనకారులు మాత్రం దీన్ని ఖాతరు చేయటం లేదు. మహిళలను ఆలయ ప్రాంగణంలోకి కూడా రానివ్వడంలేదు. అయితే ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కొందరు మహిళలు ఎలాగోలా ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.దాంతో మొత్తం కేరళ ఒక్కసారిగా అట్టుడికింది. భక్తులు బాంబు దాడులకు కూడా తెగబడ్డారు.  

తాజాగా మంగళవారం ఇద్దరు మహిళలు, మగవారిలా వేషం ధరించి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. తొమ్మిది మంది అయ్యప్ప భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తుండగా అనుమానం వచ్చిన ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. ఈ అయ్యప్ప భక్తుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తెలింది.

దాంతో ఆందోళనకారులు సదరు మహిళల్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది.  శబరిమల ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన 9 మంది మహిళా బృందంలో ఈ ఇద్దరు ఉన్నారు. మిగిలిన వారిని పంబా వద్దే భక్తులు అడ్డుకున్నారు. అయితే ఈ ఇరువురు మాత్రం మరింత ముందుకు రాగలిగారు. భక్తుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఇరువురు మహిళలను అక్కడి నుంచి వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వచ్చామని తాము అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి తీరుతామని పట్టుబట్టడంతో కొంతసేపు గందరగోళం తలెత్తింది.