మరోసారి జూనియర్‌ మౌనమే సమాధానమైందట...!

11:52 - February 26, 2019

నిన్న సాయంత్రం జరిగిన 118 ప్రీ రిలీజ్ ఈవెంట్ మరోసారి బాబాయ్ అబ్బాయిల సంగమానికి వేదికగా నిలిచింది.  ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ తర్వాత ఈ ఇద్దరూ కలుసుకోవడం ఇదే. అయితే ఎన్టీఆర్ రెండు భాగాలూ విడుదలైనా దాని గురించి ఆన్ లైన్ లో తారక్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు కాబట్టి ఈ 118 స్టేజి మీద ఏమైనా రెండు ముక్కలు చెబుతాడేమో అనుకున్నారు అభిమానులు. కానీ జూనియర్ మాత్రం అసలు దాని ప్రస్తావనే లేకుండా స్పీచ్ కొనసాగించాడు. యుద్ధవీరులకు విజయబాపినీడు కోడి రామకృష్ణ కోసం ఓ నిమిషం మౌనం పాటించిన తర్వాత నేరుగా అన్నయ్య సినిమా టాపిక్ లోకి వెళ్ళిపోయాడు. మహానాయకుడు వచ్చి నిన్నటితో కేవలం 4 రోజులే అయ్యింది. బాబాయ్ తో పాటు అన్నయ్య తన తండ్రి పాత్రలో నటించిన సినిమా. సో బాగుందనో స్పందన చూసాను సంతోషంగా ఉందనో రెండు ముక్కలు చెబితే సరిపోయేది. అసలు ఆ సినిమా వచ్చిందో లేదో అనే తరహాలో జూనియర్ అసలు ప్రస్తావనే తీసుకురాకపోవడం షాక్ కలిగించేదే. నివేదా థామస్ షాలిని గురించి సైతం తారక్ చెప్పాడు కానీ మూడు రోజుల క్రితం వచ్చిన బాబాయ్ సినిమా గురించి మాత్రం మౌనమే సమాధానం అయ్యింది.