హ్యాండ్‌ ఇచ్చేందుకు రెడీ..!

14:39 - January 19, 2019

కాంగ్రెస్‌ నేతలు హ్యాండ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతు న్నారట. రెండు రోజుల వరకు ఎటుతేల్చుకొలేని వారు సీఎల్పీ ఎంపిక పూర్తికావడం, ఇక ఆ హౌదా తమకు దక్కలేదని తెలిసిపోవడంతో...టిఆర్‌ఎస్‌లో చేరిపోనున్నారాటా.కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత కోసం వెయిట్‌చేసిన ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి జంప్‌ చేసేందుకు సిద్ధమయ్యారాటా.అది జరిగితే తెలంగాణలో కాంగ్రెస్‌ ఖాళీ కానున్నట్లే. 

తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది..అని ఎవ్వరైనా అడిగితే..షార్ప్‌గా చెప్పాలంటే..ప్రస్తుతానికి కెసిఆర్‌ హవా నడుస్తోందని చెప్పక తప్పని పరిస్థితి. ఆ ఒరవడిని వడివడిగా వినియోగించుకునేందుకు టిఆర్‌ఎస్‌ కూడా ఊబలాటపడుతోందట. అందుకే గజ్వేల్‌లో వంటేరు ప్రతాపరెడ్డిని రెండో ఆలోచనలేకుండానే గులాబీ కండువా కప్పేశారు. రెండు సార్లు సీఎం కెసిఆర్‌పై పోటీ చేసిన ఓటమి పాలైన వంటేరు, ఎన్నికల వేళ సీఎం కెసిఆర్‌పై చేసిన విమర్శలను లెక్కచేయకుండా అదలం ఎక్కించేందుకు హామీ ఇచ్చేశారు. ఇక కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు ఒక వేళ అధికార పార్టీ పంచన చేరితే ఏ స్థాయిలో మర్యాదలు, మంత్రి పదవులు ఉంటాయోనని ఊహాల్లో తేలియాడుతున్నారాటా చేతిగుర్తుపై గెలుపొందిన కొంత మంది ఎమ్మెల్యేలు. అయితే అందులో కొంత మంది సీనియర్‌ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా తామే ఎన్నికైతం.. ఎలాగో కాబినెట్‌ హౌదా ఉంటోందని భావించి..కిమ్మనకుండా కాంగ్రెస్‌ను అట్టిపెట్టుకొని ఉన్నారు. ఆ హౌదా భట్టి విక్రమార్కను వరించడంతో.. కొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో అంటిముట్టనట్లు వ్యవహారిస్తున్నారాటా. అంతేకాదు..సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే..ఏకంగా కాంగ్రెస్‌ అధిష్టానాన్ని బాహాటంగానే విమర్శించారు. లాబీయింగ్‌కే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కాంగ్రెస్‌ కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక ఇప్పటికే పలుసార్లు కెసిఆర్‌ను విమర్శించబోనని, చెప్పడమేగా తనకు సీఎం కెసిఆర్‌తో అవసరం ఉందని విధేయత ప్రకటించారు. సీఎల్పీ నేతగా అవకాశం వస్తే..న్యాయం చేస్తనన్న వారిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఉండటం గమనార్హం. అంతకంటే ముందు వరుసలోసబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్‌బాబు, సుధీర్‌రెడ్డిలు ఉన్నారు. అయితే సదరు నేతలు ఢిల్లీ నేతలు అవకాశం ఇస్తే..తీసుకుందాం, కానీ సొంతంగా  ప్రయత్నం మాత్రం చేయొద్దు. ప్రాధాన్యత ఇవ్వలేదనే నెపంతో పార్టీ మారొచ్చు..అనే యోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సదరు నేతలు ఎవ్వరూ టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న సముచిత స్థానం ఉంటోందనే మంతనాలు ఓ పక్క సాగిస్తునే ఉన్నారు. అందుకనుగుణంగా మంత్రి వర్గ విస్తరణ వాయిదాల మీద వాయిదా వేస్తు వస్తున్నారు గులాబీ బాస్‌. మొత్తంగా మంత్రివర్గ విస్తరణ లోపే కాంగ్రెస్‌ను ఖాళీ చేయాలనే యోచనలో గులాబీయింగ్‌ గట్టిగానే పనిచేస్తోంది. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందికి లాగేందుకు మంతనాలు ఎప్పుడో మొదలయ్యాయాటా. మరో వారంలోపు కారెక్కించుకొవడం ఖాయం అంటున్నాయి గులాబీ వర్గాలు. అందుకు లంగకుండా హస్తం తన పట్టును నిలబెట్టుకుంటుందా.. లేక ఢిలీపడిపోతుందో చూడాలి మరి.